Share News

KTR: అసెంబ్లీలో కేసీఆర్ ఛాంబర్‌పై కేటీఆర్ అసంతృప్తి

ABN , Publish Date - Jul 23 , 2024 | 12:04 PM

Telangana: అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు కేటాయించిన ఛాంబర్‌పై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గత సమావేశాల సందర్భంగా ఇన్నర్ లాబీలోని ఎల్‌వోపీ కార్యాలయాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తొలగించిన విషయం తెలిసిందే. ఔటర్ లాబీలో ఎల్‌వోపీకి ఛాంబర్ ఏర్పాటు చేశారు.

KTR: అసెంబ్లీలో కేసీఆర్ ఛాంబర్‌పై కేటీఆర్ అసంతృప్తి
BRS Working President KTR

హైదరాబాద్, జూలై 23: అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు (BRS Chief KCR) కేటాయించిన ఛాంబర్‌పై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) అసంతృప్తి వ్యక్తం చేశారు. గత సమావేశాల సందర్భంగా ఇన్నర్ లాబీలోని ఎల్‌వోపీ కార్యాలయాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తొలగించిన విషయం తెలిసిందే. ఔటర్ లాబీలో ఎల్‌వోపీకి ఛాంబర్ ఏర్పాటు చేశారు. రెండు రూమ్‌లు కలిపి ఒకే రూంగా అసెంబ్లీ సిబ్బంది మార్చేశారు. అయితే రూం మధ్యలో టాయిలెట్ పెట్టి వాడుకోవడానికి అనుకూలంగా లేకుండా చేశారని కేటీఆర్ మండిపడ్డారు. ఈ అంశాన్ని బీఏసీలో లేవనెత్తాలని మాజీ మంత్రి హరీష్‌రావుకు (Former Harish Rao) కేటీఆర్ సూచించారు. స్పీకర్‌ను కలిసి అభ్యంతరం వ్యక్తం చేయాలని కేటీఆర్ నిర్ణయించారు.

Budget 2024: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. అమరావతికి రూ. 15 వేల కోట్లు..


కాగా... అసెంబ్లీకి చేరుకునే ముందు గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద కేటీఆర్ నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాల్లో ఆరు గ్యారంటీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. అలాగే ఈ బడ్జెట్ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరుకానున్నారు. సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు అసెంబ్లీకి హాజరుకావాలని కేసీఆర్ నిర్ణయించారు. కేవలం ఒక్కరోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే బీజేపీ నేతలు కూడా గన్‌పార్క్‌ వద్ద అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. బీజేపీ ఎమ్మెల్యేలు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులు అర్పించారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నశించాలని, రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలని బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.


ఇవి కూడా చదవండి..

AP Assembly: ఇవాళ రెండు బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం

Madanapalle Fire Accident: మదనపల్లి అగ్నిప్రమాద ఘటనపై సీన్ రీ కన్‌స్ట్రక్షన్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 23 , 2024 | 12:06 PM