Share News

TS Assembly: గట్టి కౌంటర్‌కు కాంగ్రెస్ రెడీ.. నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ

ABN , Publish Date - Jul 23 , 2024 | 09:21 AM

Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈనెల 25న ఉభయ సభల్లో తెలంగాణ సర్కార్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈసారి సభలో పై చేయి సాధించాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. తాము చేసిన అభివృద్ధి, తీసుకున్న నిర్ణయాలు అసెంబ్లీ వేదికగా చెప్పాలని హస్తం నేతలు భావిస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలకు గట్టి కౌంటర్ ఇవ్వడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నారు.

TS Assembly: గట్టి కౌంటర్‌కు కాంగ్రెస్ రెడీ.. నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ
Telangana Assembly Session

హైదరాబాద్, జూలై 23: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈనెల 25న ఉభయ సభల్లో తెలంగాణ సర్కార్ (Telangana Govt) బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈసారి సభలో పైచేయి సాధించాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. తాము చేసిన అభివృద్ధి, తీసుకున్న నిర్ణయాలు అసెంబ్లీ వేదికగా చెప్పాలని హస్తం నేతలు భావిస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలకు గట్టి కౌంటర్ ఇవ్వడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నారు. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Former CM KCR) సభకి వస్తే ప్లాన్ ఏ, కేసీఆర్ సభకి రాకపోతే ప్లాన్ బీ అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Union Budget 2024: మధ్యతరగతిని మురిపించే పన్నుల ఊరట దక్కేనా?


కేసీఆర్ పదేండ్లలో చేయాలేని పనిని తమ ప్రభుత్వం ఏడు నెలల్లోనే చేసి చూపించిందని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చెప్పే ప్రయత్నం చేయనున్నారు. మరోవైపు అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్యా బలం పెరిగింది. కాంగ్రెస్ నుంచి 64 ఎమ్మెల్యేలు గెలుపొందిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి అదనంగా మరో 10 ఎమ్మెల్యే బలం వచ్చిచేరింది. అలాగే కాంగ్రెస్ కొత్త ఎమ్మేల్యే శ్రీ గణేష్ అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ గెలిచారు. కాగా.. ఈరోజు శాసనసభ సమావేశాలు ప్రారంభం అవనుండగా.. రేపటి నుంచి శాసనమండలి సమావేశాలు మొదలుకానున్నాయి. ఇటు మండలిలోనూ కాంగ్రెస్ పార్టీకి అదనంగా మరో ఆరుగురు ఎమ్మెల్సీలు వచ్చి చేరారు.

Union Budget 2024: అందరి చూపు బడ్జెట్‌వైపు.. సామాన్యుడి ఆశలు చిగురించేనా..!


ప్రభుత్వాన్ని నిలదీయనున్న బీఆర్‌ఎస్

మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో ఆరు గ్యారంటీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీఆర్‌ఎస్ నేతలు తెలిపారు. ఈ రోజు ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 గంటలకు గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి అసెంబ్లీకి చేరుకోనున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరు కానున్నారు. సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టే రోజు అసెంబ్లీకి హాజరుకావాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేవలం ఒక్కరోజు మాత్రమే కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది.

Smitha Sabharwal: పోలీస్‌, ఫారెస్ట్‌ సర్వీసుల్లో ఎందుకు అమలు చేయట్లేదు?


బీఆర్‌ఎస్ మీటింగ్...

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈరోజు బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది. నేటి మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణభవన్‌లో అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరుగనుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.


ఇవి కూడా చదవండి..

TS News: శంషాబాద్‌లో దారుణం... నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

AP Assembly: ఇవాళ రెండు బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 23 , 2024 | 09:25 AM