TG Contractors: సీఈసీకి తెలంగాణ కాంట్రాక్టర్లు మెుర.. ఎందుకంటే?
ABN , Publish Date - Jul 08 , 2024 | 08:34 PM
తమ బకాయిలు వెంటనే చెల్లించాలని కేంద్ర ఎన్నికల కమిషన్(Election Commission of India)ను తెలంగాణ కాంట్రాక్టర్లు(TG Contractors) కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని 15నియోజకవర్గాల్లో ఓటర్లకు కాంట్రాక్టర్లు మౌలిక సౌకర్యాలు కల్పించారు. ఆ పనులకు సంబంధించిన రూ.20కోట్లను సీఈసీ ఇప్పటి వరకు చెల్లించలేదు. దీంతో పెండింగ్ బిల్లులు చెల్లించి తమను ఆదుకోవాలంటూ కాంటాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీ: తమ బకాయిలు వెంటనే చెల్లించాలని కేంద్ర ఎన్నికల కమిషన్(Election Commission of India)ను తెలంగాణ కాంట్రాక్టర్లు(TG Contractors) కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని 15నియోజకవర్గాల్లో ఓటర్లకు కాంట్రాక్టర్లు మౌలిక సౌకర్యాలు కల్పించారు. ఆ పనులకు సంబంధించిన రూ.20కోట్లను సీఈసీ ఇప్పటి వరకు చెల్లించలేదు. దీంతో పెండింగ్ బిల్లులు చెల్లించి తమను ఆదుకోవాలంటూ కాంటాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికలు ముగిసి 6నెలలు గడిచినా.. ఇంకా బకాయిలు చెల్లించలేదని సరికాదని సీఈసీకి గోడు వెల్లబోశారు. స్థానిక ఆర్వోలు బదిలీ కావడంతో తమను ఎవరూ పట్టించుకోవడం లేదని, బకాయిలు చెల్లించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాము చిన్న కాంట్రాక్టర్లమని, అప్పులు చేసి మరీ ఎన్నికల్లో ఏర్పాట్లు చేశామని చెప్పుకొచ్చారు. వడ్డీల భారం పెరుగుతోందని త్వరగా బిల్లులు చెల్లించి ఆదుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించారు.