Home » Telangana News
సీఎం రేవంత్ తప్పుల చిట్టా రాస్తున్నానని.. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతానని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం బీజేపీ వర్క్ షాప్‌లో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన..
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి గారూ అని సంభోదించారు. అంతేకాదు.. తన నాలుకపై నల్లటి మచ్చలు ఉన్నాయని.. తాను ఏమి అంటే అది జరిగి తీరుతుందన్నారు. ఈ విషయాన్ని తన అమ్మ చెప్పిందన్నారు కోమటిరెడ్డి. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి భవిష్యత్‌లో..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రుణమాఫీ విషయంలో తనపై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డివి చీట్ చాట్లు అని.. అబద్దాల ప్రచారానికి చిట్ చాట్లను వాడుకుంటున్నారని విమర్శించారు. రుణమాఫీపై రేవంత్ ఎంత తక్కువ మాట్లాడితే..
రైతు రుణమాఫీ ప్రక్రియ మధ్యలో ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వా రం పదిరోజుల్లో ఇంటింటి సర్వే పూర్తి చేసి, రేషన్ కార్డు లేని రైతు కుటుంబాలను గుర్తిస్తామని, యాప్ ద్వారా వారికి రుణమాఫీ వర్తింపజేస్తామని చెప్పారు. మిగిలిన రూ.18 వేల కోట్ల రుణమాఫీ సొమ్ము తప్పకుండా రైతు ఖాతాల్లో జమచేసి తీరుతామని, ఎవరూ ఆందోళన చెం దాల్సిన అవసరం లేదన్నారు.
రాష్ట్రంలో భూముల విలువలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై ఇప్పటికే స్పష్టతకు వచ్చిన సర్కారు.. ప్రాథమికంగా పెంచిన విలువల్లో శాస్త్రీయత ఉండేలా చూసేందుకు ఏజెన్సీ, అధికార బృందాల ద్వారా అధ్యయనాలు చేపట్టింది.
రాష్ట్రంలో సెప్టెంబరు 17 నుంచి పది రోజులపాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేసేందుకు ఈసారి ప్రజాపాలన కార్యక్రమం చేపడతామని సీఎం చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్‌పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్ చేశారు. తనను ఇబ్బంది పెట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌గా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారైందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. కాంగ్రెస్ వర్గాల్లో సైతం జోరుగా చర్చ జరుగుతోంది.
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణ భగవానుడి కృపా కటాక్షాలు ప్రజలందరికీ అందాలని వారు ఆకాంక్షించారు. ఇందుకు సంబంధించి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఆదివారం వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.