SLBC Tunnel Resue Operation: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం..రంగంలోకి ఉత్తరాఖండ్ టన్నెల్ ఆపరేషన్ బృందం సభ్యులు
ABN , Publish Date - Feb 24 , 2025 | 11:57 AM
శ్రీశైలం ఎడమ గట్టు కాలవ సొరంగం పైకప్పు కూలడంతో చిక్కుకుపోయిన ఎనిమిది మందిని కాపాడేందుకు ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సభ్యులు కూడా రంగంలోకి దిగారు.

నాగర్‌కర్నూల్‌లోని శ్రీశైలం ఎడమ గట్టు కాలవ సొరంగం పైకప్పు కూలడంతో చిక్కుకుపోయిన ఎనిమిది మందిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. ఘటన జరిగి ఇప్పటికే 48 గంటల కావస్తుండటంటో సొరంగంలోపల చిక్కుకుపోయిన వారిని చేరుకునేందుకు ఆర్మీ, జాతీయ విపత్తు నిర్వహణ బృందం, నేవీ కమాండోలు, రాష్ట్ర అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, 2023లో ఉత్తరాఖండ్ టెన్నెల్ కూలిన సందర్భంలో బాధితులను కాపాడిన బృందం సభ్యులు తాజాగా రంగంలోకి దిగారు. అప్పటి రెస్క్యూ ఆపరేషన్ బృందంలోని ఆరుగురు సభ్యులు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు.
Nagar kurnool: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. రంగంలోకి హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు..
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సుమారు 13 కిలోమీటర్ల లోపలున్న పైకప్పు కూలడంతో ఎనిమిది మంది అక్కడ చిక్కుకుపోయారు. సొరంగంలో చిక్కుకుపోయన వారిలో నలుగురు కార్మికులు కాగా మిగతా వారు కస్ట్రక్షన్ సంస్థ సిబ్బంది. ప్రస్తుతం రెస్క్యూ బృందాలు పైకప్పు కూలిన భాగానికి 100 మీటర్ల దూరంలో ఉన్నాయి. అయితే, అక్కడ భారీగా పెరుకుపోయిన నీరు, చెల్లాచెదురుగా పడిపోయిన ఇనుప రాడ్లు, ఇతర పరికరాల కారణంగా లోపలున్న వారిని చేరుకోవడంలో ఆటంకాలు ఏర్పడుతున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రబ్బర్ ట్యూబులు, చెక్కల బల్లల సాయంతో బాధితులను చేరుకునేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. సొరంగం గోడలకు ఏర్పడిన పగుళ్ల నుంచి నీరు లోపలికి వస్తోందని కూడా సిబ్బంది తెలిపారు. నీటిని బయటకు తోడేసేందుకు అదనపు పరికరాలు అవసరమని పేర్కొన్నారు. సొరంగంపై భాగంలో రాళ్లు కదులుతున్న శబ్దాలు ఇంకా వినిపిస్తుండటంతో అక్కడి పరిస్థితి ఇంకా అస్థిరంగా ఉన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు రక్షణ చర్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిన సొరంగం లోపలి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల గురించి కూడా వాకబు చేశారు. మరోవైపు, సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
కాగా, గత రాత్రంతా తాను సొరంగంలోని సహాయక చర్యల గురించి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సహాయక చర్యలకు అడ్డంకిగా మారిన నీటిని బయటకు తోడేసేందుకు, లోపలున్న వారికి ఆక్సీజన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా, లోపలున్న వారిని చేరుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా దృష్టి పెట్టినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.
Read Latest and Telangana News