Home » Telangana News
MLC Kavitha Health Issues: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు తీహార్ జైలు అధికారులు. కాసేపటి క్రితమే ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు.
పరిసర ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా వింగ్ దూకుడుగా వ్యవహరిస్తోంది. అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తోంది. గండిపేట పరిధిలోని ఆక్రమణలపై దృష్టి సారించిన హైడ్రా.. అక్కడి అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేస్తోంది. ఈ క్రమంలోనే..
Telangana: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితకు కాంగ్రెస్ పార్టీయే బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ యే కవితకు బెయిల్ ఇప్పించేందుకు కోర్టులో వాదనలు వినిపిస్తున్నారని చెప్పారు.
Congress vs BRS: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ భవన్ ముందు ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి.
ప్రజా భవన్లో జరిగిన బ్యాంకర్స్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక కామెంట్స్ చేశారు. లెక్కలు కాదు ఆత్మ ఉండాలన్నారు. ఇప్పటి వరకు రూ. 18 వేల కోట్లు బ్యాంకులకు అందించామని.. రైతులకు మాత్రం నేటి వరకు రూ. 7,500 కోట్లు మాత్రమే చేరాయని అన్నారు.
వివాహాన్ని వినూత్నంగా జరుపుకోవాలని ఆరాటపడుతున్నాయి కొన్ని జంటలు. ఆ వినూత్నత వివాహ వేడుకల్లోనైనా ఉంటోంది లేదా వెడ్డింగ్ కార్డుల్లోనైనా ఉంటోంది. తాజాగా కరీంనగర్‌కి చెందిన ఓ యువకుడు తన పెళ్లి వెడ్డింగ్ కార్డుని వినూత్నంగా డిజైన్ చేయించాడు.
తన తండ్రిపై దాడిని తట్టుకోలేక బాలిక కుప్పకూలిపోయిన ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. బాలిక మృతికి సంతాపం ప్రకటించారు. ‘నిజంగా హృదయవిదారకమే! గూండాలు ఇంట్లోకి ప్రవేశించి...
కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ గూండాలు తమ కార్యకర్తలపై దాడులకు తెగపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం అర్థరాత్రి సిద్ధిపేటలో జరిగిన ఘటనపై స్పందించిన హరీష్ రావు.. కాంగ్రెస్ నేతల తీరును తీవ్రంగా
తెలంగాణలో మరికొన్నిరోజులు మోస్తరు వర్షాలు(Rains) కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. గురువారం నుంచి ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
సీతారామ ప్రాజెక్టును ఆగస్టు 15, 2026నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి కృష్ణా పరీవాహక ప్రాంతానికి నీళ్లు తరలించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని వారు ఉద్ఘాటించారు. ప్రాజెక్టు మూడు పంప్ హౌస్‌లు ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రులు మీడియాతో మాట్లాడారు.