Home » Telangana Politics
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వివిధ శాఖలకు చెందిన 31అంశాలు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెండింగ్ అంశాలపై కేంద్రమంత్రులతో మాట్లాడారని ఎంపీ చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ చేతగాని తనం వల్లే ఇప్పటివరకూ సమస్యలు పరిష్కారం కాలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలుగా పార్లమెంట్లో రాష్ట్ర సమస్యలపై గళమెత్తుతామని ఆయన చెప్పుకొచ్చారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay)కు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) బహిరంగ లేఖ రాశారు. కేంద్ర క్యాబినేట్లో స్థానం దక్కించుకున్నందుకు ముందుగా బండి సంజయ్‌కు పొన్నం శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం నిధులు కేటాయించేలా చూడాలని లేఖలో కోరారు.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy), కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay)పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) ఖండించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రోజుకొక పక్క పార్టీ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పుతూ కాంగ్రెస్‌లో చేర్చుకోవడం దారుణమంటూ మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉంటూ బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
బీఆర్ఎస్కు మరో భారీ షాక్ తగిలింది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. గత కొద్దిరోజులుగా ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించారు. కానీ స్థానిక నేతల అభ్యంతరంతో ఆగిపోయారు. ఇవాళ(శనివారం) మధ్యాహ్నం దానం నాగేందర్‌తో ఎమ్మెల్యే భేటీ అవ్వగా.. స్థానిక నేతలకు దానం నచ్చజెప్పారు. దీంతో కాంగ్రెస్‌లో చేరేందుకు దారి క్లియర్ అయ్యింది.
సంవిధాన్ హత్యా దివస్(Samvidhan Hatya Divas)గా జులై 25ను ప్రకటించడం చూస్తుంటే కాంగ్రెస్‌ను చూసి బీజేపీ ఏ విధంగా భయపడుతుంతో అర్థం చేసుకోవచ్చని TPCC సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్(TPCC Senior Vice President Niranjan) అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానిగా మోడీ ఎన్నికైనా.. గెలుపు మాత్రం కాంగ్రెస్‌దే అన్నట్లు ప్రజలు అభిప్రాయపడుతున్నారని ఆయన చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీని చేరికలు కుదిపేస్తున్నాయి..! ఎంతలా అంటే.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి..! తెలంగాణ సార్వత్రిక ఎన్నికల ముందు మొదలైన జంపింగ్‌లు.. కొనసాగూతనే ఉన్నాయి. దీంతో ఇవాళ బీఆర్ఎస్లో సిట్టింగ్‌లు, కీలక నేతలు రేపు ఏ పార్టీలో తెలియని పరిస్థితిలో కారు పార్టీ అధినేతలు ఉన్నారు..!
జీవితాన్ని మెదక్(Medak) పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకే అంకితం చేస్తానని ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) చెప్పారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో ఎంపీ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కృతజ్ఞత సభలో ఎంపీ పాల్గొన్నారు. అనంతరం తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికలపై రఘునందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆరు.. ఇప్పుడు ఈ నంబర్ కారు పార్టీలో (BRS) కంగారెత్తిస్తోంది..! ఇంకా చెప్పాలంటే గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు (KCR) గుబులెత్తిస్తోంది..! ఎందుకంటే.. అంతలా బీఆర్ఎస్ను ఈ నంబర్ ఇబ్బంది పెడుతోంది.. అంతకుమించి వణికించేస్తోంది..!
బీఆర్ఎస్(BRS) పార్టీకి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (TRVKS) షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్తో ఉన్న అనుబంధాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి ఎమ్మెల్సీ కవిత సైతం తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.