Home » TG Govt
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు రశీదులు(ట్రక్ షీట్) అక్కడికక్కడే జారీ చేయాలనే నిబంధన కచ్చితంగా అమలుచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం తూకం వేయగానే. రైతుల సంతకం తీసుకొని రశీదు ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
మహారాష్ట్ర! మన సరిహద్దు రాష్ట్రం.. ఆ రాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ మూలాలున్న వారు ప్రభావితం చేసే నియోజకవర్గాలు ఎన్నో...! దీంతో ఏఐసీసీ కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ నాయకులను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటోంది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. తమ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) విషయంలో అధికారుల తీరు వల్ల పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితి నెలకొంది.
హైదరాబాద్ నగర శివార్లలో నిర్మించతలపెట్టిన ఫ్యూచర్ సిటీ కోసం అదనంగా 15 వేల ఎకరాలను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రభుత్వం దాదాపు 13,973 ఎకరాల భూమిని సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్ రావును ఇప్పటికే పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. ప్రణీత్ ఇచ్చిన సమాచారం ఆధారంగా.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్‌లో పని చేసిన పలువురు అధికారులు, కానిస్టేబుళ్లను పిలిచి విచారిస్తున్నారు. SIBలో పని చేసిన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు నోటీసులు ఇచ్చారు.
మంచిర్యాల జిల్లాలోని సాయికుంట గిరిజన ఆశ్రమ పాఠశాల, ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చోటు చేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
రాష్ట్రంలో సౌరవిద్యుత్తు ఉత్పత్తికి ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం.. ఇకపై రైతుల వ్యవసాయ భూముల్లో సోలార్ విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఎవమ్ ఉత్థాన్ మహాభియాన్ (పీఎం కుసుమ్)లో భాగంగా రాష్ట్రంలోని వ్యవసాయ భూముల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఆస్తులు, బ్యాంకుల వివరాలే కాదు.. ఆధార్‌కార్డు (Aadhar card)నంబర్ ఇచ్చేందుకు కూడా పౌరులు ఆసక్తి చూపించడం లేదు. చాలావరకు వివరాలు గోప్యంగా ఉంచుతున్నారని.. ఆధార్ ఇస్తే ఆస్తులు, ఇతర వివరాలు ప్రభుత్వానికి తెలుస్తాయన్న ఉద్దేశంతో పలువురు ముందుజాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు బంద్ అయ్యాయి. సోమవారం నుంచి కొనుగోలు కేంద్రాలకు తాళం వేస్తామని తెలంగాణ కాటన్ అసోసియేషన్ ప్రకటించింది. నిరవధిక సమ్మె దిశగా జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్లర్లు అడుగులు వేస్తున్నారు. మిల్లర్లు సమ్మె ప్రకటించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది.
బీసీలను వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏడాది కిందట కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.