Home » TG Govt
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల (వీసీ) నియామకానికి సంబంధించిన పత్రాలు గవర్నర్ కార్యాలయానికి చేరాయి.
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కోడ్తో వివిధ జిల్లాలకు బదిలీ అయిన తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లను ఎన్నికల ముందు పనిచేసిన జిల్లాలకు పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లకు రెండు నెలలపాటు బ్రేక్ పడనుంది. ఎస్సీ కులాల వర్గీకరణకు సంబంధించి ఏకసభ్య జ్యుడీషియల్ కమిషన్ నివేదిక వచ్చాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో ఈ నెల నుంచే కోర్సులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కు సంబంధించిన చర్యల్ని అధికారులు చేపట్టారు.
కరీంనగర్లో 118 మంది జర్నలిస్టులకు బీఆర్ఎస్ సర్కారు కేటాయించిన ఇళ్ల స్థలాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని ఖండిస్తున్నానని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు.
తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(టీజీఈఆర్సీ) చైర్మన్గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ దేవరాజు నాగార్జున్ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గల్ఫ్ దేశాల్లో పనిచేసేందుకు వెళ్లి, వివిధ కారణాలతో తెలంగాణకు చెందిన కార్మికులు చనిపోతే ఆ కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది.
మూసీ ప్రక్షాళన విషయంలో దూకుడు మీదున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైదరాబాద్ నగరంలోని సీవరేజ్ను మూసీలో కలవకుండా చూసేందుకు ఉద్దేశించిన హైదరాబాద్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్(సీఎ్సఎంపీ)కు కేంద్ర ప్రభుత్వం సాయం కోరారు.
మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారెంటీ తీసుకున్న తర్వాతే కస్టమ్ మిల్లింగ్ కోసం ధాన్యాన్ని అప్పగించాలని సర్కారు ఇప్పటికే నిర్ణయించింది. ధాన్యం విలువలో 25 శాతం బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలని కూడా అధికారులు స్పష్టం చేశారు.
మూసీలో మురికిని తొలగించేందుకే ప్రక్షాళన కార్యక్రమం చేపట్టామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఎవరు అడ్డొచ్చినా ఇది ఆగదని స్పష్టం చేశారు. దీనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నవారు..