Share News

Courses: ఈ నెలలోనే ... స్కిల్‌ యూనివర్సిటీలో కోర్సులు !

ABN , Publish Date - Oct 09 , 2024 | 04:16 AM

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీలో ఈ నెల నుంచే కోర్సులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కు సంబంధించిన చర్యల్ని అధికారులు చేపట్టారు.

Courses: ఈ నెలలోనే ...  స్కిల్‌ యూనివర్సిటీలో కోర్సులు !

  • మొదటి విడతలో నాలుగు కోర్సులు

  • రూ.7 కోట్లతో రెడింగ్టన్‌ లాజిస్టిక్‌ ల్యాబ్‌

  • దసరా సెలవుల తర్వాత తొలి నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీలో ఈ నెల నుంచే కోర్సులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కు సంబంధించిన చర్యల్ని అధికారులు చేపట్టారు. హైదరాబాద్‌లోని ఫ్యూచర్‌ సిటీలో 57 ఎకరాల విస్తీర్ణంలో స్కిల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వర్సిటీ భవన నిర్మాణాలకు సీఎం రేవంత్‌రెడ్డి భూమిపూజ చేశారు. అయితే ఈ ఏడాది గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీలో తాత్కాలికంగా వర్సిటీ తరగతుల ను ప్రారంభించాలని ఇటీవల బోర్డ్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా సమక్షంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. రవాణా(లాజిస్టిక్స్‌), మెడికల్‌ అండ్‌ హెల్త్‌, ఫార్మా రంగాల్లో అత్యధిక ఉద్యోగాల డిమాండ్‌ ఉన్న నాలుగు కోర్సులను మొదటి విడతలో ప్రారంభించనున్నారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

దసరా సెలవుల తర్వా త ఈ కోర్సులకు సంబంధించిన అడ్మిషన్లు, అర్హత వంటి పూర్తి వివరాలతో నోటిఫికేషన్‌ను జారీ చే యనున్నారు. త్వరలోనే మరిన్ని కోర్సులను ప్రారంభించేందుకు వివిధ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వైస్‌ చాన్సలర్‌ వీఎల్వీఎ్‌సఎస్‌ సుబ్బారావు తెలిపారు. స్కిల్‌ వర్సిటీ తాత్కాలిక క్యాంప్‌సలో లాజిస్టిక్స్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందు కు ప్రముఖ గ్లోబల్‌ లాజిస్టిక్స్‌ సొల్యూషన్స్‌ కంపెనీ రెడింగ్టన్‌ ముందుకు వచ్చింది. దీనికి దాదాపు రూ.7 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడింది. లాజిస్టిక్స్‌ రంగానికి సంబంధించి రెండు స్వల్పకాలిక కోర్సులను యూనివర్సిటీ ప్రారంభించనుంది. వేర్‌ హౌసింగ్‌ ఎగ్జిక్యూటివ్‌, కీ కన్‌సైనర్‌ ఎగ్జిక్యూటివ్‌ పేర్లతో ఈ కోర్సులను నిర్వహిస్తుంది.


అదేవిధంగా నర్సులకు ఉన్నతమైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎఫ్‌ఐఎన్‌ఈ (ఫినిషింగ్‌ స్కిల్స్‌ ఇన్‌ నర్సింగ్‌ ఎక్సెలెన్స్‌) కోర్సును ఈ ఏడాది నుంచే ప్రారంభించనున్నారు. అపోలో మెడ్‌స్కిల్స్‌ లిమిటెడ్‌తో కలిసి ఈ కోర్సు నిర్వహిస్తారు. డాక్టర్‌ రెడ్డీస్‌ ఫార్మా అసోసియేట్‌ పేరుతో అప్రెంటీ్‌సషిప్‌ ఇండక్షన్‌ కోర్సును సైతం ఆరంభిస్తారు. ఈ కోర్సు కాలవ్యవధి 6 నెలలుగా నిర్ణయించారు. కాగా, వర్సిటీలో ప్రారంభించనున్న స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కోర్సులలో చేరే విద్యార్థులకు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో భాగంగా ఉద్యోగం గ్యారెంటీగా వస్తుందని వీసీ అభిప్రాయపడ్డారు. నైపుణ్య శిక్షణను అందుకున్న నెలకు కనీసం రూ.20 వేల నుంచి రూ.25 వేల వేతనం ఉండే ఉద్యోగాల్లో చేరే అవకాశాలుంటాయని ఆయన తెలిపారు.

Updated Date - Oct 09 , 2024 | 04:16 AM