Home » Tirumala Laddu Controversy
తిరుమల ఘటన తరువాత ఆలయాలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని ఆలయాల్లో ప్రొటోకాల్‌పై శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తిరుమల లడ్డూ (Tirumal Laddu) వివాదంపై సుప్రీంకోర్టులో పిల్స్ దాఖలయ్యాయి. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Former Chairman YV Subbareddy), సుబ్రహణ్యస్వామి వేర్వేరుగా పిల్స్ దాఖలు చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ చేయాలని సుబ్రహ్మణ్యస్వామి విజ్ఞప్తి చేశారు.
తిరుమలకు తాను వెళ్తానంటే బీజేపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారని ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఖండించారు. వైసీపీ అధినేతను బీజేపీ నేతలు ఎవ్వరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆయన అన్నారు.
ఏపీలో 13 జిల్లాల్లో వైసీపీ నేతలకు నచ్చిన వారికి ఇసుక రీచ్‌లు కట్టబెట్టి దోపిడీ చేశారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని అన్నారు. బీజేపీ ప్రజల పక్షాన నిలబడుతుందని.. వారి కోసం కార్యకర్తలు, ఎన్డీఏ కూటమి నేతలు కలిసి నడవాలని దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు.
తిరుమల పర్యటన రద్దు చేసుకున్న అనంతరం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు.
తిరుమల లడ్డూ వివాదంలో జగన్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ శ్రీవారి భక్తులు విమర్శిస్తున్నారు. గత ఐదేళ్లుగా సీఎం హోదాలో జగన్ తిరుమల ప్రతిష్టను దిగజార్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తుల నిరసనల మధ్య జగన్ తిరుమల పర్యటన షెడ్యూల్‌ను..
సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు నెల రోజులు తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 అమలులో ఉంటుందన్నారు. ముందస్తు అనుమతి లేనిదే ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదని ఎస్పీ స్పష్టం చేశారు. ర్యాలీలు, సభలు, సమావేశాలు ..
'తిరుమలను ప్రత్యేక దేశంగా చేయండి'.. మీరు విన్నది నిజమే. ఎవరో సాదాసీదా వ్యక్తి ఈ డిమాండ్‌ను తెరపైకి తేలేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రాజకీయ నాయకుడే ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆయన మరెవరో కాదు. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్(KA Paul).
ప్రయాగ్‌రాజ్‌లోని ఆలోప్ శంకరీ దేవి, బడే హనుమాన్, మంకమేశ్వర్‌తో సహా సంగమ్ నగరంలోని పలు ప్రముఖ దేవాలయాలు ప్రసాదాల విషయంలో పలు ఆంక్షలను ప్రకటించాయి. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రముఖ లలితా దేవి ఆలయంలో..
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఎన్డీడీబీ నివేదిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గత జగన్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు శ్రీవారి ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి సరఫరా చేసే సంస్థ తిరుమలకు దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది.