Share News

Tirupati: తిరుపతిలో సభలు, ర్యాలీలపై ఆంక్షలు.. పోలీసుల కీలక ప్రకటన..

ABN , Publish Date - Sep 26 , 2024 | 07:44 PM

సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు నెల రోజులు తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 అమలులో ఉంటుందన్నారు. ముందస్తు అనుమతి లేనిదే ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదని ఎస్పీ స్పష్టం చేశారు. ర్యాలీలు, సభలు, సమావేశాలు ..

Tirupati: తిరుపతిలో సభలు, ర్యాలీలపై ఆంక్షలు.. పోలీసుల కీలక ప్రకటన..
Section 30 Police ACT

శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 యాక్ట్ అమలు చేస్తున్నామని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు నెల రోజులు తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 అమలులో ఉంటుందన్నారు. ముందస్తు అనుమతి లేనిదే ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదని ఎస్పీ స్పష్టం చేశారు. ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించాలంటే చట్ట ప్రకారం పోలీస్ శాఖ నుండి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా బహిరంగ సభలు లేదా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేయాలంటే లిఖిత పూర్వకంగా స్థానిక పోలీసు అధికారులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. పోలీసులు ముందస్తు అనుమతి ఇస్తేనే కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందని ఎస్పీ తెలిపారు. వివిధ రాజకీయ పార్టీ నాయకులు, సంస్థలు, సమూహాలు పోలీస్ వారి ఉత్తర్వులను పాటిస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని ఎస్పీ సుబ్బరాయుడు విజ్ఞప్తి చేశారు.

Madhavilatha: శ్రీవారికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా మాధవీలత ఏం చేశారంటే..


సెక్షన్ 30 అమలులో ఉంటే..

1861 పోలీస్ యాక్ట్లోని సెక్షన్ 30 ప్రకారం పోలీసులు ఆంక్షలు విధించడాన్ని సెక్షన్ 30 యాక్ట్ అంటారు. ఈ సెక్షన్ అమలులో ఉన్న సమయంలో శాంతిభద్రతలను పరిగణలోకి తీసుకుని బహిరంగ సభలు. ర్యాలీలకు అనుమతి ఇచ్చే అధికారం పోలీసులకు ఉంటుంది. దీనిలో భాగంగా సెక్షన్ 30 అమలులో ఉన్న ప్రాంతంలోని నిర్దిష్ట ప్రదేశాల్లో సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకుండా కట్టడి చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. ఎవరైనా బహిరంగ సభలు, ర్యాలీలకు అనుమతి కోరితే వాటిపై ఆంక్షలు విధించడంతో పాటు.. ఏయే ప్రాంతాల వరకు వాటిని పరిమితం చేయాలనే దానిపై రూట్ మ్యాప్ విడుదల చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. సభలు, సమావేశాలు, ర్యాలీల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించిన సందర్భాల్లోనే సెక్షన్ 30ని పోలీసులు ప్రయోగిస్తారు. నిషేధాజ్ఞలున్న ప్రాంతాల్లో డీజే సౌండ్స్ తో ఊరేగింపులపైనా బ్యాన్ ఉంటుంది. వీటిని ఉల్లంఘించే వారిపై పోలీస్ యాక్ట్ లోని సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేస్తారు.

Kollu Ravindra: నోటికొచ్చినట్లు వాగితే.. పళ్లురాలిపోతాయ్.. జాగ్రత్త అంటూ పేర్నినానిపై ఫైర్


ముందు జాగ్రత్తగా..

తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుమలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖులు, హైందవ సంఘాల ప్రతినిధులతో పాటు రాజకీయ నాయకులు తిరుమల దర్శనానికి వెళ్తున్న నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.


AP Govt: సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి షోకాజ్ నోటీస్

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Sep 26 , 2024 | 07:44 PM