Home » Tirumala Laddu
ఎవరైనా అన్యమతస్తులు తిరుమల దర్శనానికి వస్తే స్వామి వారిపై తమకు విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. హైందవ మతాన్ని పాటిస్తున్నవారైతే నేరుగా దర్శనం చేసుకోవచ్చు. గత ఐదేళ్లలో సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి అనేకసార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వంలో ఉండటంతో ..
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై మాజీ స్పీకర్, వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు వ్యాఖ్యలు. లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ లేదని, ఆవులో కల్తీ ఉందన్నారు.
తిరుమల లడ్డూ వివాదం వెనుక బీజేపీ కుట్ర ఉందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి.. అనుమానం వ్యక్తం చేశారు.
విశ్వసనీయత లేని వైకాపా నేతలు మూర్ఖపు మాటలు ఆపకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఎన్నడూ లేని విధంగా వరదల్లో మునిగి గుడివాడ ప్రజలు అష్టకష్టాలూ పడినప్పుడు ఎక్కడి పోయావు కొడాలి నాని అంటూ మండిపడ్డారు.
తిరుపతి లడ్డూ వివాదంపై దేశ వ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్న వేళ.. నిజాలు నిగ్గు తేల్చుందుకు సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. నిజాయితీ గల అధికారులకు ఆ కమిటీలో చోటు కల్పించింది. దీంతో తమ తప్పులు ఎక్కడ బయటకు వస్తాయోననే ఆందోళనతోనే వైసీపీ నేతలు సిట్‌పై ఆరోపణలు..
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 28న తిరుమలకు వెళ్లి పూజలు చేయనున్నట్లు ప్రకటించడంపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని పరీక్షల్లో నిర్ధారణ అయినా జగన్ అబద్ధాలు ఆడుతున్నారంటూ మంత్రి మండిపడ్డారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో టెండర్లు పొందిన ఏఆర్ డెయిరీ కల్తీ నెయ్యి సరఫరా చేస్తుందనే విషయం స్పష్టమైంది. గతంలో జగన్ సీఎంగా ఉన్న సమయంలో టీటీడీకి కల్తీ నెయ్యి ట్యాంకర్లు పంపిస్తే వాటిని వెనక్కి పంపించామని వైసీపీ నాయకులే చెబుతున్నారు. గతంలోనే కల్తీ నెయ్యి పంపిస్తే.. ఆ సంస్థను..
తిరుమల లడ్డూ పవిత్రతకు భంగం వాటిల్లేలా చేసిన వైసీపీ తప్పును కప్పిపుచ్చుకునేందుకు కొత్త డ్రామాలకు తెరతీసింది. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఇందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
తిరుపతి వెంకన్న ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు తమదైన శైలిలో స్పందిస్తున్నాయి. ఇప్పటికే ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ప్రసాదానికి వినియోగిస్తున్న నెయ్యి నాణ్యతను పరీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
లడ్డూ వివాదం బయటకు వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు భిన్న స్వరాలను వినిపిస్తూ వచ్చారు. మొదట కల్తీ జరగలేదని చెప్పిన నేతలు.. ఆ తర్వాత కల్తీ జరిగిన నెయ్యిని ప్రసాదం తయారీకి ఉపయోగించలేదని చెప్పుకొచ్చారు. ఆ తరువాత కల్తీ జరిగిన నెయ్యిని..