Home » Tirumala Laddu
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు పలు నివేదికలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని సీబీఐతో విచారణ జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు (వీహెచ్) సూచించారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాకు జబర్దస్ పంచ్ పడింది. తన యూట్యూబ్ ఛానెల్లో తిరుపతి లడ్డూ వ్యవహారంపై ఆమె పోల్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆర్కే రోజాకు నెటిజన్లు గట్టి ఝలక్ ఇచ్చారు. తిరుపలి లడ్డూలో కల్తీ చేసింది ఎవంటూ రోజా తన యూట్యూబ్ చానెల్లో పొల్ చేపట్టారు.
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించడంతో.. దేశంలోని పలు ప్రముఖ పుణ్యక్షేత్రాు కొలువు తీరిన పట్టణాల్లో, నగరాల్లో లడ్డూలను కొనుగోలు చేసేందుకు ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
తిరుమల కొండపై కొలువు తీరిన శ్రీవెంకటేశ్వరుని లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జరిగినట్లు ఎన్డీడీబీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తీవ్ర దుమారం రేగింది. అలాంటి వేళ తిరుపతి లడ్డూ విషయంలో గోరఖ్‌పూర్ ఎంపీ, ప్రముఖ నటుడు రవికిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హీరో కార్తీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్లో తిరుమల లడ్డూ గురించి కార్తీ సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. లడ్డూ పవిత్రను దెబ్బతీసేలా కార్తీ మాట్లాడారని, తీరు మార్చుకోవాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
తిరుపతి లడ్డూ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. ఇటీవల తిరుపతి ఆలయానికి వెళ్లి అక్కడ కొనుగోలు చేసిన లడ్డూలో గుట్కా ప్యాకెట్ ఉన్నట్లు ఓ మహిళా భక్తురాలు విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదం తీవ్ర దుమారం రేపుతోంది.
వైసీపీ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ఆరోపించారు. టికెట్లు అమ్మి రసీదులు ఇచ్చిన లెక్కలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. టీడీపీ గొల్లపూడి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
వేంకటేశ్వరుని ప్రసాదాన్ని కల్తీ చేయడం మహా పాపమని బీజేపీ నాయకురాలు మాధవిలత అన్నారు. ధర్మాన్ని తాను పాటిస్తూ శ్రీవారి నామస్మరణ చేస్తూ వైష్ణవ దేవాలయాన్ని దర్శించుకుంటానని చెప్పారు. ఈనెల 26 వరకు తిరుమలకు చేరుకుంటానని అన్నారు. అలిపిరి నుంచి కొండపైకి కాలినడకన వెళ్లి తన వినతిపత్రాన్ని శ్రీవారికి అందజేస్తానని మాధవిలత పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో 200కు పైగా ఆలయాలు ధ్వంసం చేశారని బీజేపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని ఆరోపించారు. అంతర్వేదిలో రథం దగ్ధమైనప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించామని అన్నారు. జగన్ ప్రభుత్వం ఆలయాల ధ్వసంపై ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.