Tirupati Laddu: ప్రముఖ నటుడు రవికిషన్ సంచలన వ్యాఖ్యలు | Gorakhpur MP Ravi Kishan sensational comments on Tirulama Laddu VVNP
Share News

Tirupati Laddu: ప్రముఖ నటుడు రవికిషన్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 24 , 2024 | 12:14 PM

తిరుమల కొండపై కొలువు తీరిన శ్రీవెంకటేశ్వరుని లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జరిగినట్లు ఎన్‌డీడీబీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తీవ్ర దుమారం రేగింది. అలాంటి వేళ తిరుపతి లడ్డూ విషయంలో గోరఖ్‌పూర్ ఎంపీ, ప్రముఖ నటుడు రవికిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Tirupati Laddu: ప్రముఖ నటుడు రవికిషన్ సంచలన వ్యాఖ్యలు

గోరఖ్‌పూర్, సెప్టెంబర్ 24: తిరుమల కొండపై కొలువు తీరిన శ్రీవెంకటేశ్వరుని లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జరిగినట్లు ఎన్‌డీడీబీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తీవ్ర దుమారం రేగింది. అలాంటి వేళ తిరుపతి లడ్డూ విషయంలో గోరఖ్‌పూర్ ఎంపీ, ప్రముఖ నటుడు రవికిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: R k Roja:ఇజ్జత్ పాయె.. రోజాకు దిమ్మతిరిగే పంచ్

ABN ఛానల్ ఫాలో అవ్వండి

మంగళవారం గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయంలో జరిగిన మహంత్ అవేద్యనాథ్ వర్థంతి వారోత్సవాల ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రస్తుత ఆలయాన్ని గతంలో నడిపిన వారు హిందువులు కాదన్నారు.

Also Read: Tirupati Laddu: తిరుమల లడ్డూ వ్యవహారం.. సిట్ అధిపతి ఎవరంటే..


గతంలో హిందువులకు గొడ్డు మాంసం లడ్డూలను ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. శాస్త్రాలతో పాటు శస్త్రాలు అంటే ఆయుధాలను సైతం వెంట తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని ఎంపీ రవికిషన్ పేర్కొన్నారు. సాదువులు... యోధులుగా మారాల్సిన పరిస్థితులు వచ్చాయని రవి కిషన్ తెలిపారు.

Also Read: Geneva: వేలానికి గోల్కొండ వజ్రాలతో పొదిగిన నెక్లెస్..


టాలీవుడ్‌లోని పలు చిత్రాల్లో రవి కిషన్ నటించారు. విలన్ పాత్రలో ఆయన నటనకు తెలుగు ప్రేక్షకుడు ఫిదా అయిపోయాడు. అయితే తిరుపతి లడ్డూ వివాదం నడుస్తున్న వేళ.. తిరుమల ఆలయానికి సంబంధించి ఈ తరహా రవి కిషన్ ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తే అవకాశముందని పలువురు అభిప్రాపడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పలుమార్లు రవి‌కిషన్ గెలుపొందిన సంగతి తెలిసిందే.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 24 , 2024 | 12:21 PM