Home » Tirumala Laddu
వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం విషయంలో కవ్వింపు చర్యలకు దిగి పరువు తీసుకోవద్దని నటుడు ప్రకాశ్‌రాజ్‌ను విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) హెచ్చరించింది.
ఉగ్రవాదులను పెంచి పోషించేది మజ్లిస్ పార్టీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఒవైసీకి చెందిన కాలేజీలో పని చేసిన ఓ ఫ్యాకల్టీని ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడని గతంలో అరెస్టు చేశారని గుర్తుచేశారు.
తిరుపతి లడ్డూ విషయంలో కల్తీ ఎక్కడ కాకూడదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పుణ్యక్షేత్రాల్లో కల్తీ అసలే కాకూడదని చెప్పారు. పుణ్య క్షేత్రాల్లో రాజకీయాలకు తావు లేదని చెప్పారు. లడ్డూ విషయంలో విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిందేనని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
తిరుమల లడ్డూల తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్న విషయం తెలిసినప్పటి కడుపు రగిలిపోతోందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యి కల్తీపై ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అమరావతిలో ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు.
రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను జగన్ మార్చారని ఏపీ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు . దివంగ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఏడు కొండలను 2కొండలు అంటేనే ఎంతో పోరాటం చేశామని చెప్పారు. తనకు వ్యక్తిగతంగానూ తిరుమల శ్రీవారంటే చిన్నప్పటి నుంచీ ఎంతో నమ్మకమని సీఎం చంద్రబాబు తెలిపారు.
పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూను వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసిందని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాం ప్రసాద్ ఆరోపణలు చేశారు. జగన్ ఐదేళ్లలో ఒక్కసారైనా సతీసమేతంగా తిరుమలకు వెళ్లారా? అని ప్రశ్నించారు. జగన్ భ్రష్టు పట్టించిన వ్యవస్థలను బాగు చేసే పనిలో చంద్రబాబు ఉన్నారని తెలిపారు.
గత జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కోవ్వు వాడినట్లు నిర్థారణ కావడంతో.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్, గత టీటీడీ చైర్మన్‌తోపాటు పాలక మండలి సభ్యులపై హైదరాబాద్‌లోని సైదాబాద్ పోలీస్ స్టేషన్లో హైకోర్టు న్యాయవాది ఫిర్యాదు చేశారు.
తిరుమల లడ్డూ విషయంలో వాస్తవాలను నిగ్గు తేల్చాలని లేఖలో జగన్ పేర్కొన్నారు. శ్రీవారి లడ్డూ అంశాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని జగన్ పేర్కొన్నారు. ఏదైనా పొరపాటు జరిగిఉంటే విచారణ చేయించి ..
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంపై పూర్తి స్థాయి విచారణ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. కోట్లాది మంది భక్తుల మనో భావాలతో ముడిపడిన అంశం కావడంతో సీబీఐ విచారణకు ఆదేశించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.