Share News

YV Subba Reddy: తప్పు చేయకపోతే భయమెందుకు..

ABN , Publish Date - Sep 23 , 2024 | 01:23 PM

విజిలెన్స్ విచారణను ఆపేయాలని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని వ్యాజ్యం దాఖలు చేశారు. తన హయాంలో ఎలాంటి తప్పులు చేయకపోతే సుబ్బారెడ్డి విచారణ వద్దని..

YV Subba Reddy: తప్పు చేయకపోతే భయమెందుకు..
YV Subba Reddy

వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో విపక్షాలు ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపించినా ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు. ముఖ్యంగా దేవాదాయశాఖలో భారీ అవినీతి, నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రభుత్వం దర్యాప్తు జరపలేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో భారీగా నిధుల దుర్వినియోగం జరిగిందని, టీటీడీ బోర్డు తిరుమల ప్రతిష్ట మసకబారే నిర్ణయాలు తీసుకుంటుందని హైందవ సంఘాలు విమర్శలు చేశాయి. ఎవరెన్ని విమర్శలు, నిరసనలు చేసినా గత వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు. చివరకు ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా టీటీడీలో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే వెంటనే ఈ విచారణను ఆపేయాలని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని వ్యాజ్యం దాఖలు చేశారు. తన హయాంలో ఎలాంటి తప్పులు చేయకపోతే సుబ్బారెడ్డి విచారణ వద్దని ఎందుకు అడుగుతున్నారనే ప్రశ్న తలెత్తుతోంది.

Tirumala: తిరుమలలో ముగిసిన మహా శాంతి యాగం


విచారణ వద్దంటూ..

ఓవైపు తిరుమల లడ్డూపై వివాదం కొనసాగుతుండగా గత టీటీడీ పాలకమండలి నిర్ణయాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీంతో ఛైర్మన్ హోదాలో తీసుకున్న నిర్ణయాలపై వివరణ ఇవ్వాలని వైవీ సుబ్బారెడ్డిని విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ కోరారు. దీంతో వైవీ సుబ్బారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. టీటీడీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం రాష్ట్ర విజిలెన్స్ విభాగానికి లేదని, టీటీడీకి స్వయం ప్రతిపత్తి ఉందని, అంతర్గత విషయాలపై విచారణ చేసేందుకు టీటీడీకీ సొంత విజిలెన్స్ విభాగం ఉందంటూ సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.

Big Breaking: ముంబై నటి జెత్వానీ కేసులో కీలక పరిణామం


వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో ఎలాంటి పొరపాట్లు జరగకపోతే విజిలెన్స్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉండగా.. సుబ్బారెడ్డి విజిలెన్స్ విచారణ రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా టీటీడీ దర్శన టికెట్లు, ప్రత్యేక సేవల టికెట్లతో పాటు బ్రేక్ దర్శనం టికెట్లలో భారీ గోల్‌మాల్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే తమకు కావాల్సిన వ్యక్తులకు లాభం జరిగేలా గత టీటీడీ బోర్డు కొన్ని నిర్ణయాలు తీసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ విజిలెన్స్ విచారణ జరిగితే వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలు బయటకు వచ్చే అవకాశం ఉండటంతోనే సుబ్బారెడ్డి విచారణను వద్దంటున్నారనే చర్చ జరుగుతోంది. వైవీ సుబ్బారెడ్డి ఛైర్మన్‌గా ఉన్న సమయంలో అంతా సక్రమంగా జరిగితే ఆయనకు క్లీన్ చీట్ వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ ఆయన విచారణను ఎదుర్కోవడానికి సానుకూలంగా లేనట్లు తెలుస్తోంది. ఓవైపు ఎలాంటి విచారణకైనా సిద్ధమంటూ ప్రకటనలు చేస్తున్న వైసీపీ నేతలు.. ఈ విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారనేది తెలియాల్సి ఉంది.


AP News: మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌పై సొంత బాబాయ్ ఫైర్

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Sep 23 , 2024 | 02:39 PM