Home » Tirumala Tirupathi
దాదాపు 310 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వివాదం రగిలింది. లడ్డూలకు వినియోగించే ఆవు నెయ్యిలో జంతువుల కొవ్వు, చేప నూనె అవశేషాలు కలిశాయన్న ప్రచారంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ రాకముందు తిరుమల లడ్డూల తయారీకి కర్ణాటక నుంచి సరఫరా అయ్యే నందినీ నెయ్యిని వాడేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నందినీ నెయ్యి వాడకాన్ని ఆపేసింది.
తిరుమల లడ్డూ వ్యవహారంపై(Tirupati Laddu Row) బీజేపీ సీనియర్ నేత మాధవి లత(Madhavi Latha) స్పందించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఆమె శుక్రవారం మాట్లాడారు. తిరుపతి ప్రసాదం విషయంలో ఇలా జరగడంపై భావోద్వేగానికి గురయ్యారు.
CM Chandrababu Naidu: ఏమీ తెలియదని చెబుతున్న జగన్.. రూ. 320కే కిలో నెయ్యి వస్తుందంటే ఆలోచించొద్దా? అంటూ సీఎం చంద్రబాబు తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించారు.
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొనేందుకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు తిరుమలకు ప్రతీ రోజు పోటెత్తుతుంటారు. ఆనంద నిలయంలో స్వామి వారి నిలువెత్తు విగ్రహాన్ని దర్శించుకుని తన్మయత్వం పొందుతారు. అనంతరం ఆలయం వెలుపల శ్రీవారి ప్రసాదంగా లడ్డూను ప్రతి భక్తుడు స్వీకరిస్తాడు.
Andhrapradesh: నెయ్యిని పరిశీలించిన సమయంలో నాణ్యత చాలా ఘోరంగా ఉందని.. నాణ్యతని పెంచాలని సప్లైదారుడిని హెచ్చరించామని టీటీడీ ఈవో శ్యామలారావు చెప్పారు. నాణ్యతని పరిశీలించేందుకు టీటీడీకీ స్వంతంగా ల్యాబ్ లేదని.. టెండర్ దారుడు సప్లై చేసే ధరకు నెయ్యి ఎవరు సప్లై చెయ్యలేరని నిపుణులు చెప్పారన్నారు.
తిరుపతి లడ్డూ తయారీలో జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై ఈ రోజు సాయంత్రంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను సీఎం చంద్రబాబు ఆదేశించారు. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్లతో చర్చించి చర్యలు తీసుకుంటామని అన్నారు. భక్తుల విశ్వాసాలను, ఆలయ సాంప్రదాయాలను కాపాడతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదమంటే ఎంతో ప్రీతిపాత్రంగా భావిస్తుంటారు. హిందూ భక్తులకు అది అత్యంత ఇష్ట ప్రసాదం. అలాంటి పవిత్రమైన ప్రసాదంలో ఎద్దు, పంది తదితర జంతువుల కొవ్వు పదార్థాలతో కల్తీ అయిన నెయ్యిని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వినియోగించారని తేలడం శ్రీవారి భక్తకోటిని దిగ్ర్భాంతికి గురి చేస్తోంది.
శ్రీవారి లడ్డూ ప్రసాదమంటే ఎంతో ప్రీతిపాత్రంగా భావిస్తుంటారు. హిందూ భక్తులకు అది అత్యంత ఇష్ట ప్రసాదం. అలాంటి పవిత్రమైన ప్రసాదంలో ఎద్దు, పంది తదితర జంతువుల కొవ్వు పదార్థాలతో కల్తీ అయిన నెయ్యిని
‘శ్రీవేంకటేశ్వర స్వామి జోలికొస్తే సర్వనాశనమవుతారని గతంలోనే చెప్పా.. మళ్లీ చెబుతున్నా’ అని మంత్రి నారా లోకేశ్ అన్నారు.