Home » Tirupathi News
ప్రజలను ఏమార్చి, బ్యాగుల్లోని బంగారు నగలు, సెల్ఫోన్లు అపహరించే ఇద్దరు నిందితులను తిరుపతి క్రైం పోలీసులు(Tirupati Crime Police) అరెస్టు చేశారు. డీఎస్పీ రమణకుమార్ తెలిపిన ప్రకారం.. కృష్ణా జిల్లా గుడివాడ(Krishna District Gudivada) మండలానికి చెందిన వేముల శివకుమార్ వృత్తి రీత్యా తిరుపతి రూరల్ మండలం తనపల్లి వద్ద ఉంటున్నాడు.
తిరుపతిలో ఎనిమిది హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మంగళవారం రాత్రి 9.30 గంటల నుంచి వరుసగా ఈ హోటళ్లకు బెదిరింపు మెయిల్స్ పంపారు.
తిరుపతి జిల్లా తిరుచానూరు శిల్పారామంలో జాతీయ హిందూ ధార్మిక సదస్సు ఇవాళ (శనివారం) నిర్వహించనున్నారు. తిరుపతి క్షేత్రంలో మద్యం, మాంసం లేకుండా తిరుపతి క్షేత్రాన్ని టెంపుల్ సిటీగా మార్చాలని ఈ సమావేశంలో స్వామీజీలు డిమాండ్ చేయనున్నారు.
తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు పాటించాలని టీటీడీ సూచించింది. అనారోగ్యంతో బాధపడే భక్తులు క్రమం తప్పకుండా వెంట మందులు తీసుకువెళ్లాలని నిర్దేశించింది. కొండపై వైద్య సదుపాయాలు అందుబాటులో ఎక్కడ ఉన్నాయో తెలిపింది.
విశాఖ శారదా పీఠానికి రాష్ట్రప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. తిరుమలలో ఈ పీఠానికి జగన్ సర్కారు ‘అక్రమంగా’ కట్టబెట్టిన అదనపు స్థలం కేటాయింపును రద్దు చేసింది. అంతేగాక శారదా పీఠం ఆక్రమించిన ఈ స్థలంలో నిర్మాణాల విషయంలో నియమ నిబంధనలను అనుసరించి చర్యలు తీసుకోవాలని టీటీడీని ఆదేశించింది.
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం నాంచారంపేటలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. చెలగల కాటయ్య అనే టీడీపీ కార్యకర్త ఇంటిపై వైసీపీకి చెందిన దుంపల మధు, అతని అనుచరులు దాడి చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రాణహాని ఉందంటూ సోషల్ మీడియాలో ఓ అంగతకుడు చేసిన పోస్టు కలకలం రేపింది. ఈనెల 4న స్వామివారి బ్రహ్మోత్సవాల తొలిరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు సతీ సమేతంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు.
ఏబీఎన్ చొరవతో చావుబతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఓ యువకుడి చివరి కోరిక తీరిపోయింది. తిరుపతికి చెందిన క్యాన్సర్ బాధితుడు సురేంద్రబాబు (32) తనకో కోరిక ఉందని ఏబీఎన్‌ను ఆశ్రయించాడు. సీఎం చంద్రబాబుని కలిసి మాట్లాడాలని తాపత్రయపడ్డాడు.
తనకు ఏ పార్టీపై పగలు, ప్రతీకారాలు ఉండవని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గత పదేళ్లలో ఎన్నో అవమానాలు చూశా..భరించానని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు దాటిందన్నారు. ఈ వంద రోజుల్లో బయటకు రాలేదన్నారు.
తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుమల చేరుకున్నారు.