Home » Tirupati
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఎన్.ఆర్.జయదేవనాయుడు రూ.50లక్షలు పోగొట్టుకున్నారు. ఈనెల 5న వాట్సాప్ కాల్ చేసిన కేటుగాళ్లు తాము సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ అధికారులమంటూ బిల్డప్ ఇచ్చారు. మనీ లాండరింగ్ కేసులో మీ పేరు ఉందని, అరెస్ట్ చేసి జైల్లో పెడతామని బెదిరింపులకు పాల్పడ్డారు. తాము పంపే అకౌంట్ నంబర్లకు నగదు బదిలీ చేయాలంటూ.. సుమారు రూ.50లక్షలు తమ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు.
సీబీఐ అధికారుల పేరుతో మాజీ ఎమ్మెల్యేకే టోకారా వేసి రూ.50 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఎన్ఆర్ జయదేవ నాయుడు (85) తిరుపతి జిల్లా పాకాల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ......
Andhrapradesh: వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీకి చెందిన పలువురు పెద్దలు ఎన్నో అక్రమాలకు పాల్పడిన విషయం తెలిసిందే. మంత్రి హోదాలో ఉంటూనే దౌర్జాన్యాలకు, కబ్జాలకు తెరలేపి అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారు ఎందరో. అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అలాంటి చర్యలకు పాల్పడి ఇప్పుడు వార్తల్లో నిలిచారు.
తిరుపతి జిల్లా, పీలేరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు చించేసారు. అయితే వైసీపీ అల్లరి మూకలే బ్యానర్లను చించి ఉంటారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బ్యానర్లు చించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
చిత్తూరు జిల్లా: పుంగనూరులో ఆదివారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు పర్యటన నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ధర్నాకు చేపట్టారు. పుంగనూరు, అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసనకు దిగారు. మిథున్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
ప్రభు త్వ స్థలాల్లో అనుమతుల్లేకుండా రూ.కోట్ల ప్రజాధనంతో నిర్మించిన వైసీపీ కార్యాలయాలను ప్రజల అవసరాల కోసం కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వానికి సూచించారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన పలు విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ బృందాలు తనిఖీలు చేపట్టడం ప్రకంపనలు సృష్టిస్తోంది. టీటీడీకి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా తీసుకున్న నిర్ణయాలపై కొత్త ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్ తగిలింది. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాషతో పాటు 12 మంది మున్సిపల్ కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరారు.
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త తెలిపింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన టికెట్లను విడుదల చేసింది. విడుదల చేసిన కొద్ది గంటల్లోనే భక్తుల నుంచి అనూహ్య స్పందన లభించింది.
ఫార్మసీ, ఇంజనీరింగు పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీపీజీఈసెట్-2024 ఫలితాలను ఎస్వీయూ వీసీ ప్రొఫెసర్ శ్రీకాంత్ రెడ్డి మంగళవారం తిరుపతిలో విడుదల చేశారు