Share News

Peddirreddy : ఇంటి కోసం మున్సిపాలిటీ రోడ్డును ఆక్రమించిన పెద్దిరెడ్డి..

ABN , Publish Date - Jul 04 , 2024 | 11:13 AM

Andhrapradesh: వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీకి చెందిన పలువురు పెద్దలు ఎన్నో అక్రమాలకు పాల్పడిన విషయం తెలిసిందే. మంత్రి హోదాలో ఉంటూనే దౌర్జాన్యాలకు, కబ్జాలకు తెరలేపి అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారు ఎందరో. అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అలాంటి చర్యలకు పాల్పడి ఇప్పుడు వార్తల్లో నిలిచారు.

Peddirreddy : ఇంటి కోసం మున్సిపాలిటీ రోడ్డును ఆక్రమించిన పెద్దిరెడ్డి..
Former minister Peddireddy Ramachandrareddy

తిరుపతి, జూలై 4: వైసీపీ (YSRCP) అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీకి చెందిన పలువురు పెద్దలు ఎన్నో అక్రమాలకు పాల్పడిన విషయం తెలిసిందే. మంత్రి హోదాలో ఉంటూనే దౌర్జాన్యాలకు, కబ్జాలకు తెరలేపి అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారు ఎందరో. అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Former Minister Peddireddy Ramachandra Reddy) కూడా అలాంటి చర్యలకు పాల్పడి ఇప్పుడు వార్తల్లో నిలిచారు. ఆయన తన ఇంటి కోసం ఏకంగా మున్సిపాలిటీ రోడ్డునే ఆక్రమించేశారు. తన ఇంటికి వెళ్లడానికి అధికార దుర్వినియోగంతో మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో వేసిన రోడ్డును పెద్దిరెడ్డి ఉపయోగించుకుంటున్నారు.

CM Chandrababu: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ


వైసీపీ అధికారంలో ఉండగా రోడ్డుపై ప్రజలు ఎవరు రాకుండా ఇరువైపులా పెద్ద పెద్ద గేట్లను నిర్మించారు. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ (Municipal Corporation) రోడ్డులో ప్రజలు తిరగాలని చుట్టుపక్కల కాలనీవాసులు డిమాండ్ చేశారు. ప్రజలకు జనసేన(Janasena), టీడీపీ నేతలు (TDP) అండగా నిలబడ్డారు. గేట్లను మున్సిపల్ కార్పొరేషన్ తొలగించకుంటే తామే పడగొడతామని ఇరు పార్టీ నేతలు తేల్చిచెప్పారు. ఈ క్రమంలో పెద్దిరెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరికాసేపట్లో గేట్లు బద్దలు కొడతామని మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్ (Municipal Commissioner Aditi Singh) హామీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి...

CM Revanth: ప్రధాని మోదీ సీఎం రేవంత్ భేటీ... చర్చించే అంశాలివే!

Chandrababu: చంద్రబాబు, జగన్‌ల షెడ్యూల్‌పై ఏపీలో ఇంట్రస్టింగ్ చర్చ

Read Latest AP News AND Telugu News

Updated Date - Jul 04 , 2024 | 11:28 AM