Home » TMC
జార్ఖండ్‌లో రైలు ప్రమాదం కారణంగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతోపాటు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై విపక్ష పార్టీలు కాస్తా ఘాటుగా స్పందించాయి. ఆ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లక్ష్యంగా చేసుకుని ఆ యా పార్టీలోని కీలక నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు.
శ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆ పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ నుంచి ఆ పార్టీలోని కింద స్థాయి నేతలు వరకు అందరిని వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల సందేశ్‌కాలీలో టీఎంసీ నేత షేక్ షాజహాన్, చోప్రాలో టీఎంసీ నేత తాజ్‌ముల్‌ల వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తాయి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసపూరిత ఎత్తుగడలతో అధికారం నిలబెట్టుకుంటోందని, త్వరలోనే ఆ ప్రభుత్వ కప్పుకూలుతుందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ జోస్యం చెప్పారు. పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో ఆదివారంనాడు జరిగిన టీఎంసీ ధర్మ్‌తలా ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, అడ్డదారులు తొక్కయినా అధికారాన్ని కైవసం చేసుకోవాలని కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా మరోసారి బీజేపీ లక్ష్యంగా చేసుకొని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్యలో బీజేపీ ఓటమిపై ఆమె తనదైన శైలిలో స్పందించారు.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో సీట్లు సాధించకపోవడంతో.. ఆ రాష్ట్రంలో ప్రముఖ నేతల మధ్య విబేధాలు తారా స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఏకంగా సీఎం, డీప్యూటీ సీఎం మధ్య విబేధాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.
గవర్నర్ సీవీ ఆనంద బోస్‌పై(CV Anand Bose) ఎలాంటి పరువు నష్టం కలిగించే తప్పుడు ప్రకటనలు చేయరాదని కల్‌కత్తా హైకోర్టు(Calcutta High Court) పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి(Mamata Banerjee) సూచించింది. వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛ అనేది అపరిమిత హక్కు కాదని, పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేసి వ్యక్తి ప్రతిష్టను దిగజార్చకూడదని కోర్టు పేర్కొంది.
పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీలోని నేతలు ఇబ్బందుల్లోకి నెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. మొన్న సందేశ్‌కాలీ, నిన్న చోప్రా.. నేడు కోల్‌కతా మహానగరం.
పశ్చిమబెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికల తర్వాత వచ్చిన 4 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లోనూ టీఎంసీ సత్తా చాటుకుంది. శనివారం మధ్యాహ్నం వరకూ వెలువడిన ఫలితాల్లో 3 నియోజకవర్గాల్లో టీఎంసీ గెలుపొందినట్టు అధికారికంగా ప్రకటించగా, మరో నియోజకవర్గంలోనూ ప్రధాన ప్రత్యర్థి పార్టీ బీజేపీపై టీఎంసీ భారీ ఆధిక్యత కొనసాగుతోంది. దీంతో టీఎంసీ క్లీన్ స్వీప్ దాదాపు ఖాయమైనట్టు చెబుతున్నారు.
తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మరోసారి ఉప ఎన్నికల బరిలో హోరాహోరీగా తలబడనున్నాయి. పశ్చిమబెంగాల్ లోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలకు ఈనెల 10వ తేదీన పోలింగ్ జరగనుండటంతో గెలుపుపై రెండు పార్టీలు గట్టి ధీమాతో ఉన్నాయి.
ప్రతిపక్ష నేతల కేసుల్లో న్యాయమూర్తులు న్యాయం చేయడానికి భయపడుతున్నారని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అన్నారు.