Home » TSRTC
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన మరుసటి రోజే చార్జీల బాదుడును అధికారులు షురూ చేశారు. సిటీలో డే బస్ పాస్ చార్జీలను టీఎస్ఆర్టీసీ పెంచింది. 100 రూపాయలున్న డే పాస్ ను 120 కు పెంచింది. గతంలో మహిళలు, సీనియర్ సిటిజన్స్ కు 80 రూపాయలున్న డే పాస్ ఇప్పడు 100 రూపాయలుగా ఉంది. 80 , 100 రూపాయలు ఉన్నప్పుడు డే పాస్ కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది.
అసెంబ్లీ ఎన్నికలు(Assembly elections) సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించింది.
తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను (TSRTC) ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేసీఆర్ సర్కార్ (KCR Govt) నిర్ణయం తీసుకుంది. ఇది ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త (Good News) అని చెప్పుకోవచ్చు...
ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కీసర టోల్గేట్ సమీపంలోని ఐతవరం దగ్గర మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో రహదారిపై రాకపోకలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ మార్గంలో తిరిగే రెగ్యులర్ సర్వీసులను టీఎస్ఆర్టీసీ (TSRTC) రద్దు చేసింది.
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది. ప్రతి వీకెండ్‌కు సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులను నడపాలని సంస్థ నిర్ణయించింది. రెండు రోజుల పాటు కొనసాగే ఈ టూర్.. ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతుంది.
ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా “పల్లెవెలుగు టౌన్ బస్ పాస్”కు శ్రీకారం చుట్టింది. మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో ఈ పాస్‌ను అమలు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఈ టౌన్ పాస్‌తో ప్రయాణికులు కరీంనగర్, మహబూబ్ నగర్లో 10 కిలో మీటర్లు, నిజామాబాద్, నల్లగొండలో 5 కిలోమీటర్ల పరిధిలో అపరిమిత ప్రయాణం చేయొచ్చు.
తమిళనాడులోని అరుణాచలేశ్వరుని గిరిప్రదర్శన చేయాలనుకునే భక్తుల సౌకర్యార్థం ప్రతి పౌర్ణమికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నిర్ణయించింది. గురు పౌర్ణమి సందర్భంగా జూలై 3న గిరి ప్రదర్శనకు తొలిసారిగా నడిపిన సూపర్ లగ్జరీ బస్సులకు భక్తుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదర్శన చేయాలనుకునే భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. గురు పౌర్ణమి సందర్భంగా జూలై 3న అరుణాచలంలో జరిగే గిరి ప్రదర్శనకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును నడపాలని సంస్థ నిర్ణయించింది. సర్వీసు నంబర్ 98889 గల ఈ బస్సు.. జులై 2న ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ నుంచి బయలుదేరుతుంది.
గ్రామీణ, పట్టణ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్యాసింజర్స్‌పై ఆర్థిక భారం తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.
రోడ్డు ప్రమాదంలో విషాదం అలుముకున్న కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) అండగా నిలిచింది.