Etela Rajender: గవర్నర్ లేని సమయంలో బిల్లు పంపి.. ఆమోదించలేరంటారా?

ABN , First Publish Date - 2023-08-05T11:57:03+05:30 IST

ఆర్టీసీ విలీనం బిల్లుపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి బీజేపీ వ్యతిరేకం కాదన్నారు.

Etela Rajender: గవర్నర్ లేని సమయంలో బిల్లు పంపి.. ఆమోదించలేరంటారా?

హైదరాబాద్: ఆర్టీసీ విలీనం బిల్లుపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (BJP MLA Etela Rajender) స్పందించారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి బీజేపీ (BJP) వ్యతిరేకం కాదన్నారు. ప్రభుత్వ ప్రచారాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. గవర్నర్ (Telangana Governor) లేని సమయంలో బిల్లు పంపి ఆమోదించడం లేదని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. బట్ట కాల్చి మీద వేస్తున్నారన్నారు. ఆర్టీసీ కార్మికులకు రెండు పీఆర్సీలు ఇవ్వలేదని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు గుండెల్లో బాధను మర్చిపోలేదన్నారు. మహిళా కండక్టర్లను ఇష్టం లేకపోయినా రాజ్‌భవన్ వద్ద ధర్నాకు పంపుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని విమర్శించారు. ప్రజల కోసం సమావేశాలు జరగడం లేదని.. తమ వైపు స్పీకర్ చూడటం లేదని అన్నారు. తాము మాట్లాడితే ఒక వైపు హరీష్‌రావు, కేటీఆర్ దాడి చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామ పంచాయితీ సిబ్బంది జీతాలు రాక ఆందోళన చేస్తున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-08-05T11:57:03+05:30 IST