Home » TSRTC
దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకుల కోసం టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఎక్కవు దూరం ప్రయాణించే ప్రయాణీకులు 8రోజుల ముందుగానే అడ్వాన్స్ రిజర్వేజన్ చేసుకుంటే రిజర్వేషన్ ఫీజుఉండదని ప్రకటించింది. ఈ విషయాన్ని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ పోస్టులో తెలిపారు. రిజర్వేషన్ ఫీజు తీసుకోకపోవడం వల్ల ప్రయాణీకుడికి కొంత సొమ్ము ఆదా కానుంది. వాస్తవానికి దూరప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో వెళ్లాలనుకుంటే ముందుగానే రిజర్వేషన్లు చేసుకుంటారు. దీనికోసం రిజర్వేషన్ ఛార్జీలు వసూలు చేస్తారు.
మంట పుట్టిస్తున్న ఎండలతో గ్రేటర్లో సిటీ బస్సులు(City buses) నడపలేక ఆర్టీసీ డ్రైవర్లు చెమటలు కక్కుతున్నారు. వారం రోజులుగా నమోదవుతున్న రికార్డుస్థాయి పగటి ఉష్ణోగ్రతలతో సిటీ బస్సుల్లో గంటలకొద్దీ డ్రైవింగ్ సీట్లో కూర్చోలేక డ్రైవర్లు చుక్కలు చూస్తున్నారు.
TSRTC - Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్(Hyderabad Metro), తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు(TSRTC) కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రయాణుకుల సౌకర్యార్థం మెట్రో ట్రైన్ టైమింగ్స్.. బస్సులు(Buses) నడిపే సమయాన్ని పెంచారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఐపీఎల్(IPL 2024) సీజన్ 17లో భాగంగా..
గ్రేటర్లో బస్సుల సంఖ్య పెంచుకోవడమే లక్ష్యంగా ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. ఈ మధ్య అందుబాటులోకి తెచ్చిన 23 ఎలక్ర్టిక్ నాన్ ఏసీ బస్సుల్లో(Electric non AC buses) ఆక్యూపెన్సీ 80-90 శాతం నమోదవుతోంది.
మహాలక్ష్మి(Mahalakshmi) ఉచిత ప్రయాణంతో గ్రేటర్లో బస్ టికెట్ల ఆదాయం భారీగా తగ్గింది. గతంలో రోజుకు రూ.4 కోట్ల నుంచి 4.5 కోట్ల ఆదాయం వస్తే ఉచిత ప్రయాణం ప్రారంభం తర్వాత రూ. 2.5 కోట్ల నుంచి 3 కోట్లు మాత్రమే వస్తున్నది. అంటే రోజుకు సుమారు రెండు కోట్ల వరకు ఆదాయం తగ్గింది.
ఐపీఎల్ ఫ్యాన్స్‌కి టీఎస్ఆర్టీసీ(TSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్(Hyderabad) వేదికగా ఎస్ఆర్హెచ్(SRH), చెన్నై సూపర్ కింగ్స్(CSK) మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ యాజమాన్యం. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం వివిధ ప్రాంతాల నుంచి క్రికెట్ అభిమాలు తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో నగర నలుమూల..
శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని అరైవల్ టెర్మినల్ వరకు అందుబాటులో ఉన్న ఆర్టీసీ సేవలను డిపార్చర్ కారిడార్ వరకు పొడిగించినట్లు గ్రేటర్ ఈడీ వెంకటేశ్వర్లు(Greater Ed Venkateswarlu) తెలిపారు.
Telangana: తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి టెన్త్ పరీక్షలు మొదలయ్యాయి. ఇప్పటికే పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గంట ముందుగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.
Telangana: రాష్ట్రంలో టీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చేశాయి. మంగళవారం నాడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... గతంలో ఆర్టీసీ సిబ్బంది జీతాల కోసం ఇబ్బంది పడేవారని.. ఆర్టీసీ ఆస్తులను కోల్పోతుందనే ఆందోళన ఉండేదన్నారు. ఆర్టీసీ కార్మికులకు భావ ప్రకటన స్వేచ్చ ఉండేది కాదన్నారు.
Telangana: తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఇటీవల జరిగిన ఓ పోటీ పరీక్షల్లో ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్నను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ ఎకౌంట్లో పోస్ట్ చేస్తూ ‘‘మీ మెదడుకు పదను పెట్టండి’’ అంటూ నెటిజన్లకు ప్రశ్న సంధించారు.