TGRTC: వారంలోగా బకాయిలు కట్టకపోతే స్వాధీనం.. జీవన్ రెడ్డి మల్టీపెక్స్ వివాదంపై ఆర్టీసీ
ABN , Publish Date - May 25 , 2024 | 09:58 AM
నిజామాబాద్ జిల్లా ఆర్మూరు బస్‌స్టాండ్ సమీపంలో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Jeevan Reddy) మాల్ అండ్ మల్టీప్లెక్స్ వ్యవహారంలో హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. టీజీఎస్ఆర్టీసీకి(TGRTC) పెండింగ్లో ఉన్న రూ.2.51 కోట్ల అద్దె బకాయిలను వారం రోజుల్లోగా చెల్లించాలని విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను కోర్టు ఆదేశించింది.
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఆర్మూరు బస్‌స్టాండ్ సమీపంలో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Jeevan Reddy) మాల్ అండ్ మల్టీప్లెక్స్ వ్యవహారంలో హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.
టీజీఎస్ఆర్టీసీకి(TGRTC) పెండింగ్లో ఉన్న రూ.2.51 కోట్ల అద్దె బకాయిలను వారం రోజుల్లోగా చెల్లించాలని విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో వారంలోగా ఆర్టీసీకి ఉన్న బకాయిలు చెల్లించకపోతే మల్టీపెక్స్ ఉన్న భవనాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఆర్టీసీ తేల్చి చెప్పింది. శనివారం ఇందుకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది.
"హైకోర్టు ఆర్డర్ జారీ చేసిన రోజు నుంచి వారంలోగా అద్దె బకాయిలు చెల్లించకుంటే నిబంధనల ప్రకారం జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని తిరిగి టీజీఎస్ఆర్టీసీ స్వాధీనం చేసుకుంటుంది. భవిష్యత్ లోనూ అద్దె సకాలంలో చెల్లించకుంటే ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా మాల్‌ను స్వాధీనం చేసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది.
విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఆ షాపింగ్ మాల్‌లోని సబ్ లీజ్ దారుల ప్రయోజనం దృష్ట్యా మాల్‌ని ఓపెన్ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు సబ్ లీజ్ దారులను దృష్టిలో ఉంచుకుని జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ ను తెరిచేందుకు శుక్రవారం సంస్థ అనుమతి ఇచ్చింది. వారం రోజుల్లోగా అద్దె బకాయిలు చెల్లించకుంటే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మేం నడుచుకుంటాం" అని టీజీఆర్టీసీ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News