Home » TTD
Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ వ్యవహారం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు చాలా సీరియస్‌గా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు ఎంతో భక్తిభావంతో స్వీకరించే తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడంపై కన్నెర్ర చేస్తున్నారు. అసలేం జరిగిందంటూ...
వైసీపీ రాకముందు తిరుమల లడ్డూల తయారీకి కర్ణాటక నుంచి సరఫరా అయ్యే నందినీ నెయ్యిని వాడేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నందినీ నెయ్యి వాడకాన్ని ఆపేసింది.
తిరుమల లడ్డూ వ్యవహారంపై(Tirupati Laddu Row) బీజేపీ సీనియర్ నేత మాధవి లత(Madhavi Latha) స్పందించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఆమె శుక్రవారం మాట్లాడారు. తిరుపతి ప్రసాదం విషయంలో ఇలా జరగడంపై భావోద్వేగానికి గురయ్యారు.
CM Chandrababu Naidu: ఏమీ తెలియదని చెబుతున్న జగన్.. రూ. 320కే కిలో నెయ్యి వస్తుందంటే ఆలోచించొద్దా? అంటూ సీఎం చంద్రబాబు తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించారు.
YS Jagan Reacts on Tirumala Issue: తిరుమలలో నెయ్యి కల్తీ వివాదంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ఇదంతా చంద్రబాబు అల్లిన కట్టుకథ అని ఆరోపించారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని.. తప్పుడు ఆరోపణలతో భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.. ఇంకా చాలా కామెంట్స్ జగన్ చేశారు.. పూర్తి కథనం మీకోసం..
తిరుపతి లడ్డూ తయారీలో జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై ఈ రోజు సాయంత్రంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను సీఎం చంద్రబాబు ఆదేశించారు. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్‌లతో చర్చించి చర్యలు తీసుకుంటామని అన్నారు. భక్తుల విశ్వాసాలను, ఆలయ సాంప్రదాయాలను కాపాడతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
Andhrapradesh: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిందువుల ఆత్మను హత్య చేశారని ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ మండిపడ్డారు. హిందువుల నమ్మకాలను, విశ్వాసాలను, ఆలయం పవిత్రతను ఘోరంగా దెబ్బతీశారన్నారు. ఉద్దేశపూర్వకంగా, కావాలనే ఇలాంటి చర్యలకు జగన్ మోహన్ రెడ్డి పాల్పడ్డారని ఆరోపించారు.
టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కుళ్లిపోయిన జంతువుల కొవ్వు, చేప నూనె కలిపారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి సంచలన వాఖ్యలు చేశారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు.
Andhrapradesh: వైసీపీ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ల్యాబ్ నిర్ధారించింది. జులై 8, 2024న ల్యాబ్‌కు పంపించగా జులై 17న ఈ మేరకు ఎన్డీడీబీ సీఏఎల్ఎఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది.