Tirumala Laddu: ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉంది.. వైసీపీ బండారం బట్టబయలు
ABN , Publish Date - Sep 19 , 2024 | 04:47 PM
Andhrapradesh: వైసీపీ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ల్యాబ్ నిర్ధారించింది. జులై 8, 2024న ల్యాబ్‌కు పంపించగా జులై 17న ఈ మేరకు ఎన్డీడీబీ సీఏఎల్‌ఎఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది.
అమరావతి, సెప్టెంబర్ 19: వైసీపీ (YSRCP) హయాంలో తిరుమల (Tirumala) లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆర్గానిక్ నెయ్యితోనే తాము నైవేద్యాలు, ప్రసాదాలు తయారు చేశామని చెప్పుకొచ్చారు. అయితే, వైసీపీ నేతల మాటలు అన్నీ అబద్దాలే అని తేలిపోయింది. వైసీపీ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ల్యాబ్ నిర్ధారించింది. జులై 8, 2024న ప్రసాదం శాంపిల్స్‌ని ల్యాబ్‌కు పంపించగా జులై 17న ఎన్డీడీబీ సీఏఎల్‌ఎఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది.
KK Survey: కేకే సంచలన సర్వే.. ఎన్నికల్లో గెలుపు ఆ పార్టీదే..
ఆవు నెయ్యిలో సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతోపాటు చేప నూనె, బీఫ్ టాలో, పామాయిల్, పంది కొవ్వు కూడా ఇందులో వాడినట్లు నివేదికలో స్పష్టమైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఎన్డీడీబీ సీఏఎల్‌ఎఫ్ ల్యాబ్ ద్వారా వైసీపీ బండారం బట్టబయలైనట్లైంది. నెయ్యి కొనుగోళ్ళలో ఎటువంటి నాణ్యత పాటించలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఆధారాలతో సహా నిరూపించారు.
ఇంతకీ చంద్రబాబు ఏమన్నారంటే..
తిరుమల లడ్డూపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో తిరుమల పవిత్రతను భ్రష్టుపట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదం నుంచి నిత్యాన్న ప్రసాదం వరకు అన్నింటినీ సర్వనాశనం చేశారని తెలిపారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉపయోగించి తయారు చేయాల్సిన శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో జంతువుల కొవ్వును కలిపారని చెప్పారు.
kadambari Jethwani: మరోసారి సంచలన విషయాలు బయటపెట్టిన నటి కాదంబరి జెత్వాని
‘‘తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాసిరకంగా మార్చేశారు. ఎన్ని ఫిర్యాదుల చేసినా శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అయినా.. తిరుమలలో చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. చివరకు అన్న ప్రసాదంలోనూ నాణ్యత లేకుండా చేశారు. సాక్షాత్తూ స్వామి దగ్గర పెట్టే ప్రసాదం కూడా అపవిత్రం చేశారు. నాసిరకం సరుకులే కాకుండా, లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారు. ఈ రోజు స్వచ్ఛమైన నెయ్యి తెమ్మన్నాం. ప్రక్షాళన చేయమని చెప్పాం. ఇప్పుడు నాణ్యత పెరిగింది. ఇంకా నాణ్యత పెంచుతాం. వేంకటేశ్వరస్వామి మనరాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ఆయన కోసం ప్రపంచం మొత్తం మన దగ్గరకి వస్తోంది. అలాంటప్పడు తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని చంద్రబాబు అన్నారు.
ఇవి కూడా చదవండి...
Tirumala Laddu: తిరుమల లడ్డూలో నాసిరకం నెయ్యి వాడకం ఓ మాజీ అధికారి పుణ్యమే: ఓవీ రమణ
YV Subbareddy: టీటీడీ లడ్డుపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా...వైవీ ఫైర్
Read LatestAP NewsAndTelugu News