Home » Uddhav Thackeray
మహారాష్ట్రలోని అధికార మహయుతి ప్రభుత్వంపై విపక్ష మహా వికాస్ అఘాడి ఆదివారంనాడు విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, అవినీతి, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై ఆక్షేపణ తెలిపింది.
మహారాష్ట్ర ఎన్నికల తర్వాత షిండేకు మద్దతుగా నిలిచిన నాయకులంతా నిరుద్యోగులు కావడం ఖాయమని శనివారంనాడు శివసేన యూబీటీ పార్టీ నిర్వహించిన ఉద్యోగ మేళా కార్యక్రమంలో ఉద్ధవ్ మాట్లాడుతూ చెప్పారు.
ముంబై యూనివర్శిటీ సెనేట్ ఎన్నికల్లో అన్ని సీట్లు శివసేన (యూబీటీ) యువజన విభాగం గెలుచుకోవడంపై ఆదిత్య థాకరే సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అనుబంధ ఏబీవీపీ సహా అందరూ చిత్తుగా ఓడిపాయారని, మాతోశ్రీలో సంబరాలు మిన్నంటుతున్నాయని చెప్పారు.
ముఖ్యమంత్రి పీఠాన్ని తానెప్పుడూ ఆశించలేదని. ఇప్పుడు కూడా ఆశించడం లేదని, ఆ మాటకు తాను కట్టుబడి ఉంటానని శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ థాకరే తెలిపారు.
మహారాష్ట్రలో గణేష్ చతుర్ధి ఉత్సవాలు వైభవంగా శనివారం మొదలయ్యాయి. గణేష్ ప్రతిమలతో మండపాల్లోనూ, ఇళ్లలోనూ వినాయకుడు కొలువుతీరుతున్నాడు. వినాయకుడికి స్వాగతం పలుకుతూ మండపాలను రాజకీయ ప్రముఖులు, సెలబ్రెటీలు సందర్శిస్తూ సందడి చేస్తున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందే 'మహా వికాస్ అఘాడి' భాగస్వాములు తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని శివసేన-యూబీటీ చీఫ్ ఉద్ధవ్ థాకరే చేసిన విజ్ఞప్తిని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ శనివారంనాడు సమర్ధించారు. దీని వెనుక ఒత్తిడి రాజకీయాలు ఉన్నాయనే వాదనలను ఆయన తోసిపుచ్చారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 'మహా వికాస్ అఘాడి' గెలుపు ఖాయమని, తమది వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ అని శివసేన నేత ఉద్ధవ్ థాకరే అన్నారు. ఒక మ్యాచ్ (లోక్సభ ఎన్నికలు) ఇప్పటికే గెలిచామని, మరో మ్యాచ్ గెలవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. అధికారం చేపట్టేందుకు అధికార, విపక్షాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. వీరితోపాటు రిజర్వేషన్ల అంశం ఉండనే ఉంది. ఆ క్రమంలో విపక్ష మహావికాస్ అఘాడి కూటమిలో కుమ్ములాటలు ప్రారంభమయ్యేలా ఉన్నాయి.
మహారాష్ట్ర ఎన్నికల వేళ రాజకీయాలు రంజుగా మారాయి. ఎన్నికల వ్యుహాల్లో ప్రధాన పార్టీలు నిమగ్నం అయ్యాయి. మరట్వాడా కోటా అంశం ప్రధాన పార్టీలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే శివసేన (యూబీటీ), మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన మధ్య వివాదం నెలకొంది.
విశ్వాసఘాతుకం అనేది అతిపెద్ద పాపమని, ఉద్ధవ్ థాకరే విషయంలో అదే జరిగిందని జ్యోతిర్మఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన నేత ఉద్ధవ్ థాకరే, ఆయన కుటుంబ సభ్యులను ముంబైలోని మాతోశ్రీ నివాసంలో స్వామీజీ ఆదివారంనాడు కలుసుకున్నారు.