Share News

Shakaracharya: వంచనకు గురైన ఉద్ధవ్... జ్యోతిర్మఠం శంకరాచార్య సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 15 , 2024 | 06:39 PM

విశ్వాసఘాతుకం అనేది అతిపెద్ద పాపమని, ఉద్ధవ్ థాకరే విషయంలో అదే జరిగిందని జ్యోతిర్మఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన నేత ఉద్ధవ్ థాకరే, ఆయన కుటుంబ సభ్యులను ముంబైలోని మాతోశ్రీ నివాసంలో స్వామీజీ ఆదివారంనాడు కలుసుకున్నారు.

Shakaracharya: వంచనకు గురైన ఉద్ధవ్... జ్యోతిర్మఠం శంకరాచార్య సంచలన వ్యాఖ్యలు

ముంబై: విశ్వాసఘాతం (Betrayal) అనేది అతిపెద్ద పాపమని, ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) విషయంలో అదే జరిగిందని జ్యోతిర్మఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి (Avimukteshwaranand Saraswati) సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన (UBT) నేత ఉద్ధవ్ థాకరే, ఆయన కుటుంబ సభ్యులను ముంబైలోని మాతోశ్రీ నివాసంలో స్వామీజీ ఆదివారంనాడు కలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో థాకరేకు సంఘీభావం తెలిపారు. 2022 జూన్‌లో శివసేన సీనియర్ నేత ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేయడంతో పార్టీ రెండుగా చీలిపోయింది. ఏక్‌నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీతో చేతులుకలపడంతో ముఖ్యమంత్రి పదవికి థాకరే రాజీనామాచేశారు. షిండే సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2023 ఫిబ్రవరిలో షిండే వర్గం శివసేనను నిజమైన శివసేనగా భారత ఎన్నికల కమిషన్ గుర్తించింది.

Omar Abdullah: విడాకుల పిటిషన్‌పై మాజీ సీఎం భార్యకు నోటీసు


ఆయన తిరిగి సీఎం అయ్యేంతవరకూ...

థాకరేతో సమావేశానంతరం అవిముక్తేశ్వారానంద సరస్వతి మీడియాతో మాట్లాడుతూ, తామంతా సనాతన ధర్మాన్ని పాటించేవారమని, పాపం, పుణ్యం అనే మాటలకు అర్ధం తెలిసినవారమని అన్నారు. విశ్వాసఘాతుకం అనేది అతిపెద్ద పామమని, ఉద్ధవ్ థాకరే విషయంలో అదే జరిగిందని చెప్పారు. థాకరేకు వంచనకు గురికావడంపై తామంతా బాధపడుతున్నామని, తిరిగి ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యేంతవరకూ ఆ బాధ తగ్గదని, ఇదే విషయం థాకరేకు తాము చెప్పామని తెలిపారు. ఏక్‌నాథ్ షిండే పేరును ఆయన నేరుగా ప్రస్తావించకుండా ''మోసం చేసే వ్యక్తి హిందూ కాలేడు. ఆ బాధను సహనంతో భరించావాడే అసలైన హిందువు'' అని స్వామీజీ అన్నారు. ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని మహా వికాస్ అఘాడి (ఎంవీఏం) ప్రభుత్వం అస్థిరతకు రాజకీయ కుతంత్రాలు కారణమనే అభిప్రాయాన్ని బలపరిచేలా స్వామీజీ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో జరిగిన వంచన ప్రభావం ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కనిపించిందని చెప్పారు. తామేమీ రాజకీయాలు చేయడం లేదని, వంచనకు పాల్పడటం మహా పాపమని హిందూ మతంలో చెప్పినదే తాము చెబుతున్నామని వివరణ ఇచ్చారు.

For Latest News and National News click here

Updated Date - Jul 15 , 2024 | 07:17 PM