Home » Uddhav Thackeray
జనవరి 22న అయోధ్య రామాలయంలో రామ లల్లా ప్రతిష్టాపన కార్యక్రమానికి తనకు ఇంతవరకూ ఆహ్వానం అందలేదని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే శనివారంనాడు తెలిపారు. రామలల్లా ప్రతి ఒక్కరికి చెందిన వాడని, లాంఛనపూర్వక ఆహ్వానం తనకు అవసరం లేదని, తన మనసుసు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు యూపీలోని ఆలయాన్ని సందర్శిస్తానని చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి 23 సీట్లలో తాము పోటీ చేస్తామని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం శుక్రవారం మరోసారి తేల్చిచెప్పింది. ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగినా తమ పార్టీ ఎక్కువ సీట్లలోనే పోటీ చేస్తూ వస్తోందని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
దేశ ముఖద్వారం వరకూ నియంతృత్వం వచ్చి చేరిందని, దేశ స్వేచ్ఛను రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే అన్నారు. ఈస్ట్ ముంబైలోని కుర్లాలో సోమవారంనాడు జరిగిన జైన్ కమ్యూనిటీ కార్యక్రమంలో ఉద్ధవ్ పాల్గొన్నారు.
ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన (యూబీటీ)కి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మహిళా విభాగం చీఫ్ మీనాతాయ్ కాంబ్లి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శివసేన వర్గంలో చేరారు. ఈ పరిణామం ఉద్ధవ్ వర్గాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శివసేన-యూబీటీ చీఫ్ ఉద్ధవ్ థాకరే సోమవారంనాడు పార్టీ ఆర్గనైజేషన్‌ను పునర్వవస్థీకరించారు. ఇందులో భాగంగా శివసేన-యూబీటీ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ఆయన ప్రకటించారు. తనకు నమ్మకమైన ఆరుగురు నేతలను ఇందులో చేర్చారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శివసేన వర్గం, ఉద్ధవ్ థాకరే శివసేన వర్గం పరస్పరం దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ సోమవారంనాడు విచారణ ప్రారంభించారు. విచారణకు హాజరుకావాలని 53 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇటీవల నోటీసులు పంపారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో సనాతన ధర్మంపై డీఎంకే లీడర్, నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయంగా ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. ఈ విషయంపై తాజాగా అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ..
మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత ‘గోద్రా’ లాంటి ఘటన జరిగే అవకాశం ఉందన్నారు.
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా గోద్రా తరహా అల్లర్లు జరగవచ్చంటూ శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే చేసిన వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలని ఉద్ధవ్ తండ్రి దివంగత బాలాసాహెబ్ థాకరే అభిలషించారనే విషయాన్ని గుర్తు చేసింది.
శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో గల రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా గోద్రా తరహా అల్లర్లు జరగొచ్చని ఆరోపించారు.