Home » Ukraine
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో చారిత్రక పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్నారు. శనివారం ఉదయ ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో అడుగుపెట్టారు.
ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) ఉక్రెయిన్(Ukraine) పర్యటనపై ప్రపంచ దేశాల దృష్టి పడింది. అసలేం జరుగుతుంది, ఏం చర్చిస్తున్నారనే అంశాలపై ఆసక్తిగా ఉన్నారు. అదే సమయంలో ప్రధాని మోదీ తన ఒకరోజు పర్యటన ముగించుకుని ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే ఉక్రెయిన్-రష్యా మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఉక్రెయిన్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారంనాడు పునరుద్ఘాటించారు. శాంతి నెలకొనేందుకు భాగస్వామ్య పక్షాల మధ్య వాస్తవిక సంప్రదింపులు అవసరమని అన్నారు.
ప్రధాని మోదీ ఉక్రెయిన్లో బిజీగా ఉన్నారు. ఉక్రెయిన్ చేరుకున్న ప్రధాని మోదీకి భారత ప్రజలు ఘన స్వాగతం పలికారు. భారత్ మాతా కీ జై అని పెద్ద ఎత్తున నినాదించారు. 200 మంది భారతీయులను ప్రధాని మోదీ కలిశారు. తర్వాత ఫోమిన్ బొటానికల్ గార్డెన్లో మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.
సమస్యలకు యుద్ధ భూమిలో పరిష్కారం లభించదని ప్రధాని మోదీ అన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా సంక్షోభాలు యావత్ ప్రపంచానికి చేటు అని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ 2014లో పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా 78 విదేశీ పర్యటనలు చేశారు! ఒక దేశ ప్రధాని ఇలా విదేశీ పర్యటనలు చేయడం సాధారణమైన విషయమే కాబట్టి ఎవరూ ఆ పర్యటనల గురించి అంతగా పట్టించుకోలేదు!
ఉక్రెయిన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ‘ట్రైన్ఫోర్స్ వన్’ అనే విలాసవంతమైన రైలులో ప్రయాణించనున్నారు.
పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. భారత ప్రధాని పోలాండ్లో పర్యటిస్తుండడం గత 45 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు, స్వేచ్ఛా వాణిజ్యం గురించి చర్చలు జరగబోతున్నట్టు తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రెండు దేశాల్లో పర్యటించనున్నారు. ఆగస్ట్ 21వ తేదీన ప్రధాని మోదీ పోలాండ్కు చేరుకోనున్నారు. అనంతరం ఆగస్ట్ 23న ఉక్రెయిన్లో ఆయన పర్యటించనున్నారు. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
రెండు దేశాలు కొట్టుకుంటే యుద్ధం. ఒక దేశం వచ్చి మీద పడిపోతే దండయాత్ర. అలా రష్యా తమపై చేసిన దండయాత్రను ఉక్రెయిన్ ఇప్పుడు యుద్ధంగా మార్చింది! తమ మీదకొచ్చి పడిపోతున్న రష్యన్ సేనలను ఇన్నాళ్లుగా సమర్థంగా నిలువరిస్తున్న ఉక్రెయిన్.. ఇప్పుడు తెల్లటి త్రిభుజం(వైట్