Share News

Aliens Attack: సంచలన విషయాలు... ఏలియన్స్‌తో యుద్ధం.. ఇంత భయంకరంగా ఉంటుందా

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:08 PM

గ్రహాంతరవాసులు ఉన్నాయా.. లేవా అనే ప్రశ్న ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. దీనికి చాలా మంది ఉన్నాయనే సమాధానం చెబితే.. మరి కొందరు లేవని నమ్ముతారు. తాజాగా గ్రహాంతరవాసులకు సంబంధించి ఓ షాకింగ్ నివేదిక వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

Aliens Attack: సంచలన విషయాలు... ఏలియన్స్‌తో యుద్ధం.. ఇంత భయంకరంగా ఉంటుందా
Aliens

ఈ విశ్వంలో మనకు తెలిసినంతవరకు మనుషులు బతకుతుంది భూమి మీద మాత్రమే. అయితే మనకంటే బుద్ధి జీవులు వేరు గ్రహాల మీద నివసిస్తున్నారనే వార్తలు ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్నాయి. వీటి మీద హాలీవుడ్‌తో పాటు మన దగ్గర బాలీవుడ్‌లో కూడా ఓ సినిమా వచ్చింది. ఏలియన్స్ ఫ్లైయింగ్ సాసర్ వంటి యూఎఫ్ఓలలో అంతరిక్షం నుంచి భూమి మీదకు వస్తాయని నమ్ముతారు. చాలా మంది తమకు యూఎఫ్ఓలు కనిపించాయని కూడా చెప్పారు. అమెరికాలోని సెక్టార్ 51లో ఏలియన్స్ మీద రహస్యంగా ప్రయోగాలు జరుగుతుంటాయని.. అక్కడకు ఏలియన్స్ వస్తుంటాయనే నమ్మకం చాలా మందిలో ఉంది. ఇదిలా ఉండగా తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ డిక్లాసిఫైడ్ సీఐఏ ఫైల్ ఒకటి ఉక్రేయిన్ వేదికగా.. ఏలియన్స్, రష్యా సైనికుల మధ్య జరిగిన కోల్డ్ వార్‌కు సంబంధించిన వివరాలను వెల్లడిస్తుంది. దీనిలో ఉన్న విషయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి.


ఈ డాక్యుమెంట్‌ని 2000 సంవత్సరంలో డిక్లాసిఫైడ్ చేశారని.. కెనెడియన్ వీక్లీ వర్ల్డ్ న్యూస్, ఉక్రెయిన్ పేపర్ హోలోస్ ఉక్రెయినీ ప్రచురించాయి. దీనిలో ఉన్న దాని ప్రకారం.. సైనికుల బృందం ఒకటి ఫ్లైయింగ్ సాసర్ మీదకు కాల్పులు జరిపింది. దాంతో ఆగ్రహించిన ఏలియన్స్ సుమారు 23 మంది సైనికులను రాళ్లుగా మార్చి అక్కడ నుంచి పరారయినట్లు డాక్యుమెంట్ వెల్లడించింది. దీనిపై సీఐఏ సుమారు 250 పేజీల కేజీబీ రిపోర్ట్‌ను విడుదల చేసింది. 1991లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాలు.. ఫొటోలతో పాటుగా.. ఏలియన్స్ ఎటాక్ తర్వాత రష్యా సైనికులు ఎలా కుప్ప కూలారో కూడా ఈ 250 పేజీల డాక్యుమెంట్‌లో వివరించారు.


సైనికులంతా రాళ్లుగా మారిపోయారని నివేదికలో చెప్పుకొచ్చారు. అమెరికన్ ఏజెంట్ ఒకరు దీని గురించి మాట్లాడుతూ.. గ్రహాంతరవాసుల ప్రతీకారం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ దృశ్యాలు చూస్తే అర్థం అవుతుంది అని చెప్పుకొచ్చాడు. నివేదికలో ఉన్న దాని ప్రకారం.. ఉక్రెయిన్‌లో ఉన్న రష్యా సైనికులు ట్రైనింగ్ ఎక్స్‌ర్‌సైజ్‌లో ఉండగా.. సాసర్ షేప్‌లో ఉండి భూమికి అతి సమీపంలో ఎగురుతున్న ఓ స్పేస్‌షిప్‌ని గుర్తించారు. ఆ బృందంలో ఉన్న ఓ సైనికుడు.. ఆ యూఎఫ్ఓ మీదకు ఉపరతలం నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణిని సంధించాడు. దాంతో యూఎఫ్ఓ కుప్ప కూలింది.


రాళ్లుగా మారిపోయిన సైనికులు..

ఆ సమయంలో దాని నుంచి చాలా చిన్నగా ఉన్న ఐదు మానవ రూపాలు బయటకు వచ్చాయి. వాటి తలలు చాలా పెద్దగా ఉండటమే కాక.. వారి కళ్లు చాలా పెద్దగా, నల్లగా ఉన్నట్లు నివేదికలో పొందుపరిచారు. భూమి మీదకు వచ్చిన తర్వాత ఆ గ్రహాంతరవాసులు ఒక గ్రూపుగా మారి.. అందరూ కలిసి పోయి.. ఒకే గోళాకార వస్తువుగా మార్పు చెందారు. ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే ఆ గోళాకార వస్తువు పరిమాణం అంతకంతకు పెరుగుతూ.. ప్రకాశవంతమైన వెలుగును విరజిమ్ముతూ నింగిలోకి దూసుకుపోయిందని.. ఈ తతంగాన్ని చూస్తోన్న సుమారు 23 మంది సైనికులు రాళ్లుగా మారిపోయారని నివేదికలో వెల్లడంచారు.


కేజీబీ ఫైల్‌లో పొందుపరిచిన వివరాలు నిజమే అయితే.. ఆయుధాలు, సాంకేతికతకు సంబంధించి.. గ్రహాంతర వాసుల గురిచి మనం ఊహిస్తున్న దాని కన్నా.. చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉన్నారని సీఐఎ తెలిపింది. 1989-1990 సంవత్సరాల మధ్య ఈ సంఘటన చోటు చేసుకుని ఉంటుందని కెనెడియన్ వీక్లీ వర్ల్డ్ న్యూస్ అంచాన వేసింది. దీని గురించి తొలిసారి 1993లో ప్రచురించింది.

ఇవి కూడా చదవండి:

Supreme Court: సెలవుల్లో బుల్డోజర్లు దింపాల్సిన అవసరం ఏంటి.. సర్కార్‌కు సుప్రీం సూటి ప్రశ్న

Husband Kills Wife: భార్యను చంపి.. సెల్‌పోన్ చూస్తూ..

Updated Date - Apr 16 , 2025 | 12:11 PM