Home » Uttarakhand
ఉత్తర కాశీ టన్నెల్(Uttarakhashi Tunnel Collapse) లో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపడటానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 3 అంబులెన్స్ లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీలో సొరంగం కూలిన ఘటనలో శిథిలాల్లో చిక్కుకున్న కూలీలకు సంబంధించిన విజువల్స్ మొదటిసారి బయటకువచ్చాయి. సొరంగంలో మొత్తం 41 మంది కార్మికులు చిక్కుకున్న సంగతి తెలిసిందే.
క్షణ క్షణం ఆందోళన, ఉత్కంఠకు గురి చేస్తున్న ఉత్తర కాశీ టన్నెల్(Uttarkashi rescue) ఘటనలో ఊరటనిచ్చే విషయం చెప్పారు అధికారులు. కార్మికులకు ఫుడ్ సప్లై చేసేందుకు ఏర్పాటు చేసిన 6 అంగుళాల పొడవైన పైపు వారు ఉన్న లోకేషన్ కి చేరుకుంది.
ఉత్తరాఖండ్(Uttarakhand)లో టన్నెల్ కుప్పకూలిన ఘటన జరిగి నేటికి 9 రోజులు. టన్నెల్(Uttarakhand Tunnel Collapse)లో చిక్కుకుపోయిన 41 మంది కార్మికుల ప్రాణాలు దక్కుతాయన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. అమెరికా యంత్రాల సాయంతో కార్మికులను చేరుకోవాలనే ప్రయత్నాలు ఆశించినమేర ఫలించలేదు. దీంతో ఇవాళ అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణులు కార్మికులను రక్షించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఉత్తరాఖండ్(Uttarakhand)లో సొరంగం కూలిన ఘటనలో చిక్కుకుపోయిన 40 మంది కార్మికులను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందుకోసం అమెరికాకు చెందిన అత్యాధునిక డ్రిల్లింగ్ పరికరంతో సహాయక చర్యలు చేపట్టారు.
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న టన్నెల్ ఆదివారం ఉదయం కుప్పకూలంతో తలెత్తిన ఉత్కంఠ 70 గంటలు గడిచినా కొనసాగుతోంది. సొరంగంలో చిక్కుకుపోయిన 40 మంది కార్మికులను వెలికితీసేందుకు రిస్క్యూ టీమ్‌లు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నప్పటికీ వాతావరణ ప్రతికూలత, మంగళవారం రాత్రి మళ్లీ కొండచరియలు విరిగిపడటంతో సహాయక యత్నాల్లో ఆటంకం తలెత్తింది.
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఒక సొరంగం కుప్పకూలడంతో 36 మంది వరకూ అందులో చిక్కుకుపోయారు. శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయక కార్యక్రమాలు చేపట్టింది.
UCC: యూనిఫాం సివిల్ కోడ్(ఉమ్మడి పౌర స్మృతి) అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్(Uttarakhand) అవతరించనుంది. జస్టిస్ (రిటైర్డ్) రంజనా దేశాయ్(Justice Ranjana Desai) నేతృత్వంలోని కమిటీ తన నివేదికను సమర్పించడంతో ఉత్తరాఖండ్ యూనిఫాం సివిల్ కోడ్(Uniform Civil Code)ను అమలు చేసిన తొలి రాష్ట్రంగా చరిత్రలో నిలవనుంది.
రోడ్డు ప్రమాదంలో ఉత్తరాఖండ్(Uttarakhand) మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్‌కి(Harish Rawat) గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరీశ్ రావత్ మంగళవారం అర్ధరాత్రి హల్ద్వానీ నుంచి ఉదమ్ సింగ్ నగర్ లోని కాశీపుర్ కి కారులో బయల్దేరారు. బాజ్ పుర్ వద్దకు రాగానే రావత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న డివైడర్ ను ఢీ కొట్టింది.
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పార్టీ విభాగాలన్నింటినీ రద్దు చేశారు. ఈ మేరకు పార్టీ ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్ర విభాగాలను రద్దు చేశామని, వెంటనే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని ఆ ప్రకటనలో తెలిపింది.