Home » Vegetable Prices
వాతావరణం రానున్న ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా. వాతావరణ పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు మంట పుట్టిస్తున్నాయి. మార్కెట్లో ఎలాంటి కూరగాయలు కొన్నాలన్నా కేజీ రూ.60కి పైగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. రూ.100 ఖర్చు చేసినా గంపెడు కూరగాయలు కూడా రావడం లేదు. అటు బియ్యం ధరలు కూడా పెరిగిపోయాయి. దీంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా నిత్యావసరాల ధరలు తగ్గకపోతే ప్రజలు తమ ఓటు ఆయుధంతోనే ఎన్నికల్లో సమాధానం చెప్తారని గతంలో పలు మార్లు రుజువైంది.
తెలుగు రాష్ట్రాల నుంచి బియ్యం ఆయా రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇక్కడ ఒక పంట పోవడం, పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి కావడంతో బియ్యం రేట్లు పెంచేస్తున్నారు. ఈరోజు ఉన్న ధర రేపు ఉండడం లేదు. లలిత, అక్షయ, ఆవుదూడ, బెల్ తదితర రకాలు మూడు, నాలుగు నెలల క్రితం 26 కిలోల బస్తా రూ.1,200-రూ.1,250 మధ్య లభించేవి. ఇప్పుడు రూ.1,450-రూ.1,550కి అమ్ముతున్నారు.