Home » Vijayawada
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెలుగు ఆది కవయిత్రి మెుల్ల కాంస్యం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర, మైసూర్ మహారాజు, ఎంపీ, యదువీర కృష్ణదత్త చామరాజ వడియార్ పాల్గొన్నారు.
Andhrapradesh: నగరంలోని కండ్రిక, బోస్ నగర్, జర్నలిస్టు కాలనీలో మంత్రి నారాయణ సుడి గాలి పర్యటన చేశారు. వరద నీరు ఉన్న ప్రాంతాలతో పాటు శానిటేషన్ జరుగుతున్న చిన్న చిన్న రోడ్లపై స్వయంగా బైక్ నడుపుకుంటూ మంత్రి పర్యటించారు. నిన్నటి వరకు వరద నీరు ఉన్న ప్రాంతాల్లో శరవేగంగా వందలాది పారిశుధ్య కార్మికులతో క్లీనింగ్ పనులు జరుగుతున్నాయి.
Andhrapradesh: విజయవాడ ఎయిర్ పోర్ట్లో కొత్త రోడు ప్రారంభించడం జరిగిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... మైసూర్ ఎంపీ యువరాజ్ ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశంలో చాలా ఎయిర్పోర్టులు ఉన్నా కానీ గన్నవరం ఎయిర్పోర్ట్పై దృష్టి పెట్టినట్లు తెలిపారు.
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై వేటు వేశారు. నాడు కేసును దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ ఎం.సత్యనారాయణ, విజయవాడ పశ్చిమ జోన్ ఏసీపీ కె.హనుమంతరావును సస్పెండ్ చేస్తూ డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు.
వైసీపీ హయాంలో వేధింపులకు గురైన ముంబయి సినీ నటి కాదంబరీ జిత్వానీ శుక్రవారం విజయవాడకు చేరుకున్నారు. అనంతరం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పలువురిపై ఫిర్యాదు చేశారు.
విజయవాడ: నగరంలో పలు చోట్ల జరుగుతున్న వరద నీటి పంపింగ్ పనులను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. కండ్రిక, జర్నలిస్టు కాలనీ, రాజీవ్ నగర్లో వరద నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో పర్యటించారు. 64 వ డివిజన్ స్పెషల్ ఆఫీసర్ సంపత్ కుమార్తో కలిసి బుడమేరులో వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద ఇరుక్కున్న బోట్లను తొలగించడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. రోజురోజుకూ ఈ వ్యవహారం క్లిష్టతరంగా మారుతోంది.
Andhrapradesh: కనివిని ఎరుగని వర్షం ప్రభావంతో భారీ వరదలతో ఏపీలో అనేక గ్రామాలు జలమయం అయ్యాయని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి సినీ బృందం చేరుకుంది.
పండుగకు ఎప్పుడు వస్తున్నావ్ నాన్నా..?? ఏమో తెలియదు.. రైళ్లు ఖాళీలేవమ్మా... దసరా, దీపావళి(Dussehra and Diwali) పండగలు సమీపిస్తుండడంతో హైదరాబాద్(Hyderabad) నుంచి స్వస్థలాలకు వెళ్లే ఆలోచనలో ఉన్న వారు తమ కుటుంబసభ్యులతో జరుపుతున్న సంభాషణ ఇదే.
భారీ వరదల సమయంలో ప్రకాశం బ్యారేజీకి కొట్టుకువచ్చిన బోట్లు కౌంటర్ వెయిట్స్ను కాకుండా కట్టడాలను తాకి ఉంటే 3 జిల్లాలు బంగాళాఖాతంలో కలిసిపోయేవని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.