Minister Nimmala: బోట్ల వెలికితీతకు విశాఖ నుంచి ప్రత్యేక బృందాలు: మంత్రి నిమ్మల
ABN , Publish Date - Sep 10 , 2024 | 09:53 PM
భారీ వరదల సమయంలో ప్రకాశం బ్యారేజీకి కొట్టుకువచ్చిన బోట్లు కౌంటర్ వెయిట్స్‌ను కాకుండా కట్టడాలను తాకి ఉంటే 3 జిల్లాలు బంగాళాఖాతంలో కలిసిపోయేవని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
అమరావతి: భారీ వరదల సమయంలో ప్రకాశం బ్యారేజీకి కొట్టుకువచ్చిన బోట్లు కౌంటర్ వెయిట్స్‌ను కాకుండా కట్టడాలను తాకి ఉంటే 3 జిల్లాలు బంగాళాఖాతంలో కలిసిపోయేవని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. భారీ వరద సమయంలోనూ రూ.1.50కోట్ల విలువైన బోట్లకు లంగరు వేయలేదంటూ ఉద్దేశ పూర్వకంగానే కుట్ర చేసినట్లు అర్థం అవుతోందని మంత్రి ఆరోపించారు. విచారణ అనంతరం బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి హెచ్చరించారు.
బోట్ల వెలికితీసేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదని మంత్రి నిమ్మల తెలిపారు. మూడు పడవలకూ కలిపి ఒకటే లింక్ ఉండటంతో వెలికి తీయడంలో సమస్యలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఒక్కో దాన్ని బరువు 40టన్నులు ఉందని, మూడింటి బరువు 120టన్నుల వరకూ ఉంటుందని మంత్రి చెప్పారు. భారీగా బరువు ఉండడంతో పెద్దపెద్ద క్రేన్ల సహాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నించినా కుదరడం లేదని చెప్పుకొచ్చారు. పడవల నిండా ఇసుక ఉండడం.. ఒక దానితో మరొకటి ముడి పడి ఉండడంతో అవి అంగులం కూడా కదలడం లేదని పేర్కొన్నారు.
బ్యారేజ్, ప్రజల భద్రత దృష్ట్యా బోట్లను బయటకు తీసేందుకు విశాఖ నుంచి ప్రత్యేక టీమ్‌లు బుధవారం వస్తున్నట్లు మంత్రి నిమ్మల తెలిపారు. ప్రత్యేక బృందాలు నీటిలోకి దిగి పడవలను భారీ కట్టర్ల సహాయంతో ముక్కలుగా కోస్తారని తెలిపారు. అనంతరం అప్పటి పరిస్థితిని బట్టి వాటిని కేన్ల సహాయంతో పైకి తీసుకురావడమా లేక గేట్ల గుండా కిందకు విడిచిపెట్టడమా అనేది నిర్ణయిస్తామని నిమ్మల తెలిపారు. బుధవారం సాయంత్రాని కల్లా తొలగింపు పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రకాశం బ్యారేజ్ మీద రాకపోకలకు ఇబ్బంది లేకుండా త్వరగా పనులు చేయాలని మంత్రి నారా లోకేశ్ సైతం సూచించినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
ఈ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
Minister Nimmala: ఆ పనులు వెంటనే మెుదలు పెట్టండి: మంత్రి నిమ్మల
CM Chandrababu: విజయవాడ సబ్ కలెక్టరేట్‌లో బీమా సంస్థల స్టాల్స్ ఏర్పాటు..
CM Chadrababu: ఇవాళ చంద్రబాబు పెళ్లిరోజు.. అయినా సరే..
Janasena: జనసేన జెండాకు ఘోర అవమానం.. భగ్గుమన్న జనసైనికులు