Home » Vijayawada
వరద కారణంగా బుడమేరు వరద మళ్లింపు కాలువ (బీడీసీ) ఎడమ కట్టకు పడిన గండ్ల పూడిక పనులు యుద్ధ ప్రాతిపధికన కొనసాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌కు పట్టిన శని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అధికార తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. గత ఐదేళ్లలో జగన్ చేసిన తప్పుల వల్లే రాష్ట్రంలో వరద పోటెత్తిందని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. గత ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఇలా జరిగి ఉండేది కాదని చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ పెను విపత్తు అని మండిపడింది.
బుడమేరు నది జలవిలయం సృష్టించింది. 20 నిమిషాల్లోనే అంతా అయిపోయిందని ఓ మహిళ కన్నీటి పర్యంతం అయ్యింది. ఫ్రీజ్, వాషింగ్ మిషన్లు, టీవీ పాడయిపోయాయని వివరించారు. బుడమేరు నది ప్రవాహంతో ఒక్కొక్కరికి రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లింది. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో వరదలు రాలేవని వాపోతున్నారు.
వారం రోజులపాటు కురిసిన భారీ వర్షాలకు బుడమేరుకు గండి పడి విధ్వంసం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అప్రమత్తమైన ఏపీ అధికార యంత్రాంగం గండి పూడ్చివేత పనులు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఆర్మీ జవాన్లతో పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటిస్తున్నారు. కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో కలిసి ఆయన పర్యటిస్తున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అనంతరం.. ప్రజల్లోకి వెళ్లి వారి పరిస్థితిని శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టినట్లు ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మరో 48గంటల్లో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
Andhrapradesh: భారీ వర్షాలతో మహోగ్రరూపం దాల్చిన బుడమేరు వరద నిన్న కాస్త తగ్గినట్టు అనిపించగా ఈరోజు మరోసారి వరద ఉధృతి పెరిగింది. రెండు అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో నిన్న ప్రజలు తమ నివాసాల్లోకి వెళ్లి బురదను శుభ్రం చేస్తున్నారు.
విజయవాడలో వరదలకు ప్రాణనష్టంతోపాటు ఆస్తి నష్టం కూడా భారీగానే జరిగింది. ముఖ్యంగా ఇంటి సామగ్రి, ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోయాయి. వీటితోపాటు వేల సంఖ్యలో కార్లు నీట ముగిని దెబ్బతిన్నాయి. దీంతో వాటి రిపేర్లకు యజమానులు నానావస్థలు పడుతున్నారు.
చిన్న వ్యాపారులు, చిరుద్యోగులు, రోజువారీ కూలీలు... ఇంకా ఎందరెందరో సామాన్య, పేద, దిగువ మధ్య తరగతి జీవులు! బుడమేరు వరద వీరి బతుకులను ముంచేసింది!
ముంపులో మునిగి, బురద పేరుకుపోయి కష్టాల కడలిలా మారిన వరద బాధిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా సర్కారు ముమ్మర చర్యలు తీసుకుంటోంది. సహాయ చర్యల్లో వేగం పుంజుకొంది.