Share News

AP Politics: ఏపీకి జగన్ పెను విపత్తు: మంత్రి అనగాని

ABN , Publish Date - Sep 06 , 2024 | 05:31 PM

ఆంధ్రప్రదేశ్‌కు పట్టిన శని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అధికార తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. గత ఐదేళ్లలో జగన్ చేసిన తప్పుల వల్లే రాష్ట్రంలో వరద పోటెత్తిందని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. గత ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఇలా జరిగి ఉండేది కాదని చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ పెను విపత్తు అని మండిపడింది.

AP Politics: ఏపీకి జగన్ పెను విపత్తు: మంత్రి అనగాని
YS Jagan Is Big Disaster

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు పట్టిన శని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) అని అధికార తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. గత ఐదేళ్లలో జగన్ చేసిన తప్పుల వల్లే రాష్ట్రంలో వరద పోటెత్తిందని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. గత ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఇలా జరిగి ఉండేది కాదని చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ పెను విపత్తు అని మండిపడింది.


YS-Jagan.jpg


పోటెత్తిన వరద

‘వైసీపీ అధినేత జగన్ చేసిన తప్పిదాల వల్లే రాష్ట్రంలో వరదలు పోటెత్తాయి. పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ‘మ్యాన్ మేడ్ డిజాస్టర్’లో ఉన్న మ్యాన్ జగన్ రెడ్డే. పోలవరం, వెలిగొండ, పట్టిసీమను పట్టించుకోలేదు. సాగునీటి ప్రాజెక్టుల్లో తట్ట మట్టి వేయలేదు. జగన్ చేసిన మానవ తప్పిదాలు అన్నీ ఇన్నీ కావు. 2021లో పింఛ ప్రాజెక్టు కొట్టుకుపోయేందుకు అప్పటి ఇసుక మాఫియా కారణం. 2021లో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 44 మంది చనిపోయారు. వేలాదిమంది నిరాశ్రయులు అయ్యారు. అందుకు ఇసుక మాఫియా కారణం. ప్రాజెక్ట్ గేట్లకు గ్రీజు కూడా పెట్టలేదు. జగన్ చేసిన తప్పులు ప్రజలకు శాపాల్లా మారాయి. బుడమేరు కాలువ చుట్టుపక్కల అప్పటి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కబ్జాలకు పాల్పడ్డారు. విజయవాడ వరదలకు జగన్ రెడ్డే కారణం. బుడమేరు నుంచి వరద నీటిని కృష్ణా నదికి తరలించేందుకు 2017-18లో టీడీపీ ప్రభుత్వం 150 కోట్లు ఖర్చు చేసింది. అధికారం చేపట్టిన వెంటనే వైసీపీ ప్రభుత్వం ఆ పనులను ఆపేసింది. అందువల్లే వరద బీభత్సం సృష్టించింది. వరద బీభత్సానికి జగన్ రెడ్డే కారణం అని’ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.


Khammam-Floods.jpg

Updated Date - Sep 06 , 2024 | 05:31 PM