Home » Vinayaka Chaviti
కడప కార్పొరేషన్ పరిధిలో నిబంధనల ప్రకా రం గణేశ ఉత్సవాలు చేసుకోవాలని కమి షనర్ వైవో నందన్ సూచించారు. గణేశ్ ప్రతిమలు పెట్టేటప్పుడు పోలీసు, ఫైర్, కార్పొరేషన్ అనుమతులు తప్పనిసరన్నా రు.
ఖైరతాబాద్(Khairatabad) వినాయకుడి విగ్రహ తయారీ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది 70అడుగుల మట్టి వినాయకుడు సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.
వినాయక చవితి ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. వినాయక చవితి, వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై వివిధ విభాగాల అధినేతలతో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. వినాయక చవితి, నిమజ్జనం ఏర్పాట్ల గురించి ఈ రోజు చర్చించామని మీడియాకు వివరించారు. వినాయక చవితి సందర్భంగా గతంలో లోపాలు జరిగాయని, ఆ లోటుపాట్లు లేకుండా ఈ సారి నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
సప్తముఖ మహాశక్తి గణపతిగా ఈసారి ఖైరతాబాద్(Khairatabad0 మహా గణపతి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈమేరకు ప్రధాన శిల్పి చినస్వామి రాజేంద్రన్‌తో పాటు నిపుణులైన వెల్డింగ్ కళాకారులు పనులను వేగవంతం చేశారు. గతంలోనూ సప్తముఖ మహా గణపతిని తయారు చేసినా, ఈ ఏడు కాలమానం ప్రకారం ప్రపంచశాంతితో పాటు సర్వజనులకు ఆయురారోగ్యాలు కలిగేలా గణపతిని సప్తముఖాలతో పూజించాలని దివ్యజ్ఞాన సిద్ధాంతి గౌరీభట్ల విఠల శర్మ సూచించారు.
ఎడారి దేశాలలో ప్రపథమ ప్రవాసీ తెలుగు సంఘమైన కువైత్‌లోని తెలుగు కళా సమితి గణేష్ చతుర్థిని పురస్కరించుకుని ఇటీవల తాండవ నృత్య కరీ గజానన కూచిపూడి నృత్యాలు, చిన్నారుల ప్రార్ధన గీతాలు, తెలుగు కవి వ్యంగ్యానుకరణల మేళవింపుతో వైభవంగా నిర్వహించింది.
హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ (HYFY) లండన్ ఆధ్వర్యంలో 11వ వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. లండన్‌కు సమీపంలో ఉన్న రీడింగ్ నగరంలో గణపతి వేడుకలు, నిమజ్జనం జరిగింది.
ఉత్సవాలు, పండుగల సమయంలో ఓవైపు భక్తులు హడావుడిలో ఉంటే.. మరోవైపు దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తుంటారు. మన పక్కనే ఉంటూ మనక్కూడా తెలీకుండా పర్సులు, ఫోన్లు కొట్టేయడం చూస్తూ ఉంటాం. ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో ఇలాంటి..
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా వినాకయ చవితి పూజా కార్యక్రమం స్థానిక పీజీపీ హాల్లో ఘనంగా జరిగింది.
వినాయకుడు.. మన నాయకుడేనని హిందువుల అందరి ప్రగాఢమైన భావన.. విశ్వాసం కూడా. ఎందుకంటే.. తలచిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు రాకుండా.. దిగ్విజయంగా పనులు పూర్తి కావాలంటే ఆ గణనాయకుడిని నిర్మల మనసుతో స్మరిస్తే చాలు.. పరిపూర్ణంగా ఆశీర్వదిస్తాడు..
విశాఖలో వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటున్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని విశాఖలో వివిధ రూపాలలో గల గణనాధులను ఏర్పాటు చేశారు.