Hyderabad: దర్శనానికి ఖైరతాబాద్ మహా గణపతి సిద్ధం
ABN , Publish Date - Sep 06 , 2024 | 08:57 AM
ఖైరతాబాద్(Khairatabad) భారీ గణపతి భక్తుల పూజలందుకునేందుకు సిద్ధమయ్యాడు. ముహూర్తం ప్రకారం గురువారం మధ్యాహ్నం 12 గంటలకు శిల్పి చినస్వామి రాజేంద్రన్ గణపతికి నేత్రాలను తీర్చిదిద్ది విగ్రహానికి ప్రాణం పోశారు. భక్తులు పెద్ద ఎత్తున జయజయ ధ్వానాలు చేస్తూ గణేష్ మహారాజ్‌కీ జై అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు.
- ప్రాణం పోసిన శిల్పి
- జోష్‌ఫుల్‌గా ఆగమన్..
- ఉత్సవాల బందోబస్తులో 400 మంది పోలీసులు..
- వాహనాలతో రాకండి : ఏసీపీ సంజయ్‌కుమార్
హైదరాబాద్: ఖైరతాబాద్(Khairatabad) భారీ గణపతి భక్తుల పూజలందుకునేందుకు సిద్ధమయ్యాడు. ముహూర్తం ప్రకారం గురువారం మధ్యాహ్నం 12 గంటలకు శిల్పి చినస్వామి రాజేంద్రన్ గణపతికి నేత్రాలను తీర్చిదిద్ది విగ్రహానికి ప్రాణం పోశారు. భక్తులు పెద్ద ఎత్తున జయజయ ధ్వానాలు చేస్తూ గణేష్ మహారాజ్‌కీ జై అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్‌రాజ్, కార్యదర్శి రాజ్‌కుమార్, ఉత్సవ కమిటీ ప్రతినిధులు గుమ్మడికాయలు, కొబ్బరికాయలు కొట్టి బలి తీశారు.
ఇదికూడా చదవండి: Hyderabad: ఆహా.. ఏం ఐడియాగురూ.. జీవితంలో స్థిరపడాలని వారెంచుకున్న మార్గం ఏంటో తెలిస్తే..
నేత్ర పర్వంగా ఆగమన్..
ఖైరతాబాద్ గణపతి పూర్తి స్థాయిలో సిద్ధమై కళ్లను తీర్చిదిద్దడంలో ఉత్సవ కమిటీ తొలిసారిగా ఆగమన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. స్థానిక యువకులు పెద్ద ఎత్తున ఈఆగమన్‌లో పాల్గొని జోష్‌గా నృత్యాలు చేశారు. యువతతో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి డాన్స్ చేసి సరదాగా గడిపారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా ఈ సందర్భంగా విచ్చేశారు.
బందోబస్తుకు 3 షిఫ్టుల్లో 400 మంది పోలీసులు..
ఖైరతాబాద్ గణపతిని దర్శించుకునేందుకు ఈసారి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉండడం, శని, ఆదివారాలు రెండు సార్లు రావడంతో పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. తొలిరోజునే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు గవర్నర్‌లు పూజలకు రానుండడంతో 24 గంటల పాటు పోలీసులు 3 షిఫ్టుల్లో విధులు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. భారీ గణపతి వద్ద బందోబస్తు కోసం ముగ్గురు డీఎస్‌పీలు, 13 మంది ఇన్‌స్పెక్టర్లు, 33 మంది ఎస్‌ఐలు, 22 ప్లాటూన్ల సిబ్బంది పనిచేస్తారని సైఫాబాద్ ఏసీపీ ఆర్ సంజయ్ కుమార్ తెలిపారు.
ట్రాఫిక్ ఆంక్షలు
- ఖైరతాబాద్ గణపతి దర్శనం కోసం వచ్చే భక్తులు సొంత వాహనాలను తీసుకురాకపోవడం మంచిది.
- రైల్వేగేటు గుండా నడచుకుంటూ వచ్చిన వారినే లోనికి అనుమతిస్తారు. ఈ మార్గంలో వాహనాలను అనుమతించబోరు.
- ఖైరతాబాద్ ఫ్లైఓవర్ గుండా వచ్చిన వారు వాహనాలను ఐమాక్స్ పక్కనున్న పార్కింగ్ స్థలంలో పార్కు చేసి నడుచుకుంటూ దర్శనానికి రావాలి.
- మింట్ కాంపౌండ్ వైపు వచ్చే భక్తులు వాహనాలను కారు రేసింగ్ ప్రాంతంలో పార్కు చేసి, నడచుకుంటూ దర్శనానికి రావాలి.
- రోడ్లపై వాహనాలను నిలిపితే సీజ్ చేస్తాం.
- గణపతికి మూడు వైపులా 500 మీటర్ల వరకు నో వెండింగ్ జోన్ ఉంది. చిరు వ్యాపారాలకు అనుమతి లేదు.
- ఆనంద్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్, సైఫాబాద్.
భారీ జంధ్యం, కండువాలు
ఖైరతాబాద్ భారీ గణపతికి ఎప్పటిమాదిరిగానే ఖైరతాబాద్ పద్మశాలీ సంఘం వారు జంధ్యం, కండువా, నూతన పట్టువస్త్రాలను సిద్ధం చేశారు. గురువారం ఖైరతాబాద్ పద్మశాలి సంఘం కార్యాలయంలో అధ్యక్షుడు కడారి శ్రీధర్, గౌరవ అధ్యక్షులు గుర్రం కొండయ్య, ప్రధాన కార్యదర్శి ఏలె స్వామి వీటిని ప్రదర్శించారు. ఈసారి 75 అడుగుల భారీ జంధ్యం, కండువాలతో పాటు నైపుణ్యం కల చేనేత కళాకారులతో వీటిని తయారు చేయించామని, పండుగ రోజైన శనివారం రాజ్‌దూత్ హోటల్ నుంచి భారీ ర్యాలీగా వచ్చి గణపతికి వీటిని సమర్పించనున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొంటారని అధ్యక్షుడు శ్రీధర్ తెలిపారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News