Home » Visaka
విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో్ గెలుపే లక్ష్యంగా వైవీ సుబ్బారెడ్డితో కలిసి ప్రణాళికలు వేస్తున్నామని.. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టామని మంత్రి సిదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. అందరి లక్ష్యం రానున్న ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలన్నదేనని అన్నారు. మొన్న జరిగిన సిద్ధం సభ నుంచి ప్రతిపక్షాలు డైలమాలో ఉన్నాయన్నారు.
విశాఖ: తూర్పు నియోజక వర్గంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం కార్యక్రమానికి ఆహ్వానించడానికి జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చానని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు.
విశాఖ: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఇప్పుడు ఏ పార్టీలో ఉందో అందరూ ఒక సారి గమనించాలన్నారు. జగన్మోహన్ రెడ్డిని జైలు పాలు చేసిన పార్టీతో షర్మిల చేతులు కలిపి ఏపీకి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
విశాఖ: నగరంలో ల్యాండ్ మాఫియా రెచ్చిపోయింది. చినగదిలి రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్యను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రమణయ్య సోదరుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ...
ఇంగ్లండ్తో విశాఖపట్నం టెస్టు మ్యాచ్లో యశస్వి జైస్వాల్ సెంచరీ సాధించి అదరగొట్టాడు. తన సెంచరీ ఇన్నింగ్స్లో యశస్వికి ఇది సరికొత్త రికార్డు కావడం విశేషం. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
విశాఖపట్నం: వైసీపీ ప్రభుత్వంపై జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు విశాఖలో వేల ఎకరాలు ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని..
విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కబ్జాల గుప్పిట్లో విశాఖ భూమాతను బందీ చేసి రైల్వే జోన్ కోసం 53 ఎకరాల భూమిని ఇవ్వలేక పోయారని, సీఎం జగన్ సిగ్గు పడాలని అన్నారు.
విశాఖ: మెగా డీఎస్సీ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాగా చేశారని, ఇప్పుడు ఎన్నికలు ఉన్నందువలనే డిఎస్సీ అని చెప్పి మళ్లీ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు విమర్శించారు.
విశాఖ: నగరంలో జన జాగరణ సమితి ప్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. శనివారం భీమిలిలో వైసీపీ ఆధ్వర్యంలో సిద్ధం పేరుతో ఎన్నికల సభ జరగనుందది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరవుతున్నారు.
విశాఖ: అంగన్వాడీ కార్యకర్తల సమ్మె దూకుడు పెంచింది. శనివారం నుంచి రాత్రి కూడా సమ్మె కొనసాగిస్తున్నారు. చలిలో టెంట్ల కింద అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె కొనసాగిస్తున్నారు. వారం రోజులపాటు రాత్రి కూడా సమ్మెలో కూర్చుంటామని స్పష్టం చేశారు.