Home » Visakhapatnam
పదేళ్ల క్రితం ఇదే రోజు హుద్ హుద్ తుఫాన్ దాటికి విశాఖ నగరం చిగురుటాకులా వణికిపోయింది. తెల్లవారుజాము నుంచి గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు లక్షలాది చెట్లు, వేలాది విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.
జాయ్ జమీమా పగలు మేకప్ వేసుకుని.. రాత్రులు బ్రేకప్ చెబుతుంది. జాయ్ జమీమా తెర వెనుక బ్లాక్మెయిల్ డ్రామాలు నడుపుతుంది. అర్ధరాత్రి బాధితుల ఇంటికి పోలీసులతో వెళ్లి అరెస్టు చేయాలంటూ హల్ చల్ చేస్తుంది. వెంటనే అరెస్ట్ చేయాలంటూ పోలీసులను సైతం జాయ్ జమీమా బెదిరిస్తుంది. తన తల్లి గెజిటెడ్ ఆఫీసర్ అంటూ మాయ మాటలు చెబుతుంది.
నాలుగు ప్రధాన దేశాలు కలిసి భవిష్యత్తులో మరోసారి నిర్వహించబోయే మలబార్ విన్యాసాల కోసం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై విశాఖలో గురువారం కీలక సమావేశం జరిగింది.
విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. రోజువారీ కార్యకలాపాలకు కూడా నిధులు లేని పరిస్థితి ఏర్పడింది. జీతాలు సైతం సగమే చెల్లిస్తు న్నారు. రోజుకు 21 వేల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాల్సిన ప్లాంటులో ఇప్పుడు 4వేల టన్నులకు మించి ఉత్పత్తి జరగడం లేదు.
పారిశ్రామిక దిగ్గజం రతన్‌టాటా ఆరేళ్ల క్రితం విశాఖపట్నాన్ని సందర్శించారు. ఏయూ పూర్వ విద్యార్థుల కార్యక్రమంలో పాల్గొన్నారు.
Andhrapradesh: తిరుమల లడ్డూ విషయంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను బట్టి కేంద్రం దర్యాప్తు చేయాలని అన్నట్టు ఉందన్నారు. తిరుమల లడ్డూ విషయంలో సీబీఐ ఎంక్వయిరీ వెయ్యాలని అందరికంటే ముందు కాంగ్రెస్ పార్టీ అడిగిందన్నారు.
విశాఖపట్నం: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం ఉదయం ఆరున్నర గంటలకు సింహాచలం వరాహనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం ప్రధాన అర్చకులు, అధికారులు లోకేష్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Telangana: స్టీల్‌ప్లాంట్‌పై విపక్షం దుష్ప్రచారం చేస్తోందని మంత్రి లోకేష్ మండిపడ్డారు. ఐదేళ్ల తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారన్నారు. విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమలు ఇబ్బందుల్ని తెలుసుకొని పరిష్కరిస్తున్నామని చెప్పారు. విశాఖపట్నంకి ఎప్పుడు తమ ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.
Andhrapradesh: సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి వారి సన్నిధిలో చేపట్టిన సంప్రోక్షణ శాంతి హోమం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబు, గణబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ..ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు దిగ్విజయంగా పూర్తి చేశారన్నారు.
భీమిలి పట్టణానికి చెందిన ఓ బాలుడు గత కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో బాలిక వెంటపడ్డాడు. ఆమె తిరస్కరించినప్పటికీ రోజూ వెంటపడేవారు. అయితే ఇదే క్రమంలో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండడాన్ని గమనించి అత్యాచారం చేశాడు.