YS Sharmila: లడ్డూ వివాదానికి మతం రంగు పూయడం సరికాదు
ABN , Publish Date - Oct 02 , 2024 | 11:28 AM
Andhrapradesh: తిరుమల లడ్డూ విషయంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను బట్టి కేంద్రం దర్యాప్తు చేయాలని అన్నట్టు ఉందన్నారు. తిరుమల లడ్డూ విషయంలో సీబీఐ ఎంక్వయిరీ వెయ్యాలని అందరికంటే ముందు కాంగ్రెస్ పార్టీ అడిగిందన్నారు.
విశాఖపట్నం, అక్టోబర్ 2: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని నగరంలో ఉన్న గాంధీ విగ్రహానికి నివాళులర్పించేందుకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (APCC Chief YS Sharmila Reddy) విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో షర్మిలకు కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ విషయంపై సుప్రీంకోర్టు (Supreme Court) చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ఈ వ్యవహారాన్ని కేంద్రం దర్యాప్తు చేయాలని అన్నట్టుగా ఉందన్నారు. తిరుమల లడ్డూ విషయంలో సీబీఐ ఎంక్వయిరీ వెయ్యాలని అందరికంటే ముందు కాంగ్రెస్ పార్టీ అడిగిందన్నారు. సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నర్‌ను కూడా కలవడం జరిగిందన్నారు.
Governor: హైడ్రా ఆర్డినెన్స్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..
చీఫ్ జస్టిస్ కూడా లడ్డూ విషయాన్ని సుమోటోగా స్వీకరించాలని కాంగ్రెస్ పార్టీ లేఖ రాయడం జరిగిందని తెలిపారు. సుప్రీంకోర్టు కూడా తమతో పాటు ఏకీభవిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ లడ్డూ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ పార్టీ ముందే చెప్పిందన్నారు.‘‘ ఒకరేమో శాంతి పూజలు అంటున్నారు.. మరొకరేమో పశ్చాత్తాప దీక్షలంటున్నారు.. ఇంకొకరేమో ప్రక్షాళన పూజలు అంటున్నారు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకొని ఈ విషయానికి మతం రంగు పూస్తున్నారు ఇది సరికాదు’’ అంటూ వైఎస్ షర్మిల వ్యాఖ్యలు చేశారు.
గాంధీజీకి నివాళులు..
కాగా... ఎయిర్‌పోర్టు నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్న షర్మిలను అక్కడ ఏర్పాటు చేసిన గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన దీక్షలో షర్మిల పాల్గొన్నారు. కాగా.. నగరంలో గాంధీ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నారు. పార్టీలకు అతీతంగా నేతలు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇవి కూడా చదవండి...
Harish Rao: ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకంక్షలు: హరీష్ రావు
Read Latest AP News And Telugu News