Share News

Joy Jemima: పగలు మేకప్.. రాత్రులు బ్రేకప్.. వెలుగులోకి జాయ్ జమీమా దారుణాలు.

ABN , Publish Date - Oct 11 , 2024 | 10:40 AM

జాయ్ జమీమా పగలు మేకప్ వేసుకుని.. రాత్రులు బ్రేకప్ చెబుతుంది. జాయ్ జమీమా తెర వెనుక బ్లాక్‌మెయిల్ డ్రామాలు నడుపుతుంది. అర్ధరాత్రి బాధితుల ఇంటికి పోలీసులతో వెళ్లి అరెస్టు చేయాలంటూ హల్ చల్ చేస్తుంది. వెంటనే అరెస్ట్ చేయాలంటూ పోలీసులను సైతం జాయ్ జమీమా బెదిరిస్తుంది. తన తల్లి గెజిటెడ్ ఆఫీసర్ అంటూ మాయ మాటలు చెబుతుంది.

Joy Jemima: పగలు మేకప్.. రాత్రులు బ్రేకప్.. వెలుగులోకి జాయ్ జమీమా దారుణాలు.
Joy Jemima

విశాఖ: హనీ ట్రాప్ కేసులో (Honey Trap Case) కీలక సూత్రధారి జాయ్ జమీమా (joy jemima) దారుణాలు సోషల్ మీడియా (Social Media)లో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జాయ్ జమీమా గ్యాంగ్ ఇచ్చిన మత్తు మందు (Narcotics) కారణంగా బాధితులు (victims) ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు. శరీరంపై పొక్కులు రావడంతో కనీసం పడుకోలేని పరిస్థితి ఏర్పడింది. శరీరమంతా రక్తంతో ఇబ్బంది పడిన ఫోటోలను ఓ బాధితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జాయ్ జమీమా గ్యాంగ్ చేతిలో నరకం అనుభవించానని పోలీసులకు వెల్లడించాడు.


జాయ్ జమీమా పగలు మేకప్ వేసుకుని.. రాత్రులు బ్రేకప్ చెబుతుంది. జాయ్ జమీమా తెర వెనుక బ్లాక్‌మెయిల్ డ్రామాలు నడుపుతుంది. అర్ధరాత్రి బాధితుల ఇంటికి పోలీసులతో వెళ్లి అరెస్టు చేయాలంటూ హల్ చల్ చేస్తుంది. వెంటనే అరెస్ట్ చేయాలంటూ పోలీసులను సైతం జాయ్ జమీమా బెదిరిస్తుంది. తన తల్లి గెజిటెడ్ ఆఫీసర్ అంటూ మాయ మాటలు చెబుతుంది. నగర సీపీ, కలెక్టర్‌కు తన తల్లి మంచి ఫ్రెండ్ అంటూ పోలీసులను బెదిరించిన వీడియోలను బాధిత బంధువులు పోస్ట్ చేశారు.


కాగా విశాఖ హనీ ట్రాప్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితురాలు జాయ్ జెమీమా పోలీసులకు ఝలక్ ఇచ్చినట్లు గుర్తించారు. 10 నెలల కిందటే ఓ వ్యాపారవేత్తను హనీ ట్రాప్ చేసి కేసు పెట్టించింది. ఆ సమయంలో జాయ్ జమీమా మోసాలను పోలీసులు గుర్తించలేకపోయారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో అనేకమంది అమాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా గుర్తించారు. వరుసగా ఫిర్యాదులు రావడంతో ఆమె మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

జాయ్ జమీమా టార్గెట్ ధనవంతులు, అధికారులు, ఎన్నారైలు. అందమైన ఫోటోలను ఆయా వ్యక్తులకు పంపి వారిని ట్రాప్ చేయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఆ తర్వాత రూమ్‌కు పిలిపించుకుని వారికి మత్తు మందు ఇచ్చి నగ్నంగా ఫోటోలు చిత్రీకరించి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తుంది. ఆమె బాధితులు దాదాపు 15 మంది ఉన్నట్లు సమాచారం. వారిలో వ్యాపారవేత్తలు, ఎన్నారై, పోలీసులు, నేవీ అధికారులున్నట్లు తెలియవచ్చింది. ఇప్పటివరకు బాధితుల్లో కొంతమంది మాత్రమే బయటకు వచ్చారు. త‌మ‌ కేసు వివరాలు బయటకు వస్తాయనే భ‌యంతో నేరుగా సీపీకి ఫిర్యాదు చేశారు.


ఇక్కడ ట్విస్టు ఏంటంటే తనను రేప్ చేశాడంటూ 10 నెలల కిందట బాధితుడిపై మద్దిలపాలెం పోలీసుస్టేషన్‌లో జాయ్ జమీమా రివర్స్ కేసు పెట్టింది. ఇప్పుడు ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఆమెను పోలీసు కస్టడీకి తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. ఈ మేరకు కోర్టులో పిటిషన్ వేయనున్నారు. మిగిలిన జాయ్ జమీమా అనుచరుల గురించి పోలీసులు విచారణ చేస్తున్నారు. వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని సీపీ వెల్లడించారు. జెమీమా బాధితులు.. ఒక్క విశాఖలోనే కాదు.. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సిద్ధిదాయిని అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి

విజయవాడ: మహిషాసురమర్ధినిగా అమ్మవారి దర్శనం..

ఎనిమిదవ రోజుకు చేరుకున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 11 , 2024 | 12:46 PM