Home » Vizag steel plant
స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించే బాధ్యత పూర్తిగా తాను తీసుకుంటానని ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్ (Palla Srinivasa Rao) తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కూర్మం పాలెం వద్ద చేపట్టిన దీక్ష1223 రోజులకు చేరుకుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టులో కార్మికుల మధ్య ఏర్పడిన వివాదంపై ఏపీ హైకోర్టు (AP High Court) ఈరోజు(బుధవారం) విచారణ చేపట్టింది. ఈ వివాదంపై యూనియన్ కోర్టు హైకోర్టులో ధిక్కార పిటీషన్ దాఖలు చేసింది. గంగవరం పోర్టులో కార్మికుల ఆందోళనతో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా ఆగిపోయిందని వెంటనే జోక్యం చేసుకోవాలని గతంలో హైకోర్టులో పోర్టు యూనియన్ నేత కేవీడి ప్రసాద్ పిటీషన్ దాఖలు చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తన వల్లే ఆగిపోయిందని ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో తన సత్తా ఏంటో సీఎం జగన్, ప్రధాని మోదీకి తెలిసిందని వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లాయర్ లేకుండా వాదించానని గుర్తుచేశారు. ఆర్డర్ తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేశానని కేఏ పాల్ స్పష్టం చేశారు.
వచ్చే నెలలో ఎన్నికయ్యేలోగానే విశాఖపట్నం స్టీల్‌ప్లాంటును మూసివేయించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టున్నాయి. ఈసారి చేతికి మట్టి అంటకుండా భారీస్థాయిలో కుట్ర చేస్తున్నారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంటును ఆనుకొని ప్రభుత్వం నిర్మించిన గంగవరం పోర్టును అదానీ గ్రూపు పూర్తిగా హస్తగతం చేసుకున్న
స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఏ చట్ట ప్రకారం ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీ కరిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ (Steel Plant) ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ..
విశాఖ స్టీల్ ప్లాంట్‌ని దోచుకోడానికి కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (Ka Paul) అన్నారు. సోమవారం నాడు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... రాత్రికి రాత్రికి స్టీల్ ప్లాంట్‌ని అమ్మేశాయని.. ఈ విషయాన్ని తాను కోర్టులో చెప్పానని అన్నారు.
లాభాల్లో నడుస్తున్న ఉక్కు కర్మాగారం అమ్మకానికి పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి (Raghuveera Reddy) అన్నారు. శనివారం నాడు కాంగ్రెస్ న్యాయ సాధన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ దీన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు.
విశాఖ: ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం మహా పాదయాత్ర ప్రారంభమైంది. కూర్మన్నపాలెం దీక్షా శిబిరం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర సాగనుంది. ఈ పాదయాత్రలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు, అఖిలపక్షం కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
విశాఖకు తలమానికమైన స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవడమే తన లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) తెలిపారు. శుక్రవారం నాడు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నాయకులతో గంటా శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు.
పోలవరం, సుజల స్రవంతి, విశాఖ రైల్వే జోన్, మెట్రో విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ( Konatala Ramakrishna ) తెలిపారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కొణతాల రామకృష్ణ చెప్పారు.