Srinivasa Varma: జగన్ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను గాలికొదిలేసింది
ABN , Publish Date - Jan 23 , 2025 | 08:19 PM
Srinivasa Varma: స్టీల్ ప్లాంట్‌లో మేనేజ్మెంట్ లోపాలు ఉన్నాయని... వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌ను ఎంతో సాయం చేస్తున్నారని అన్నారు. సిల్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉండాలని మోదీ భావిస్తున్నారని చెప్పారు.

పశ్చిమగోదావరి: జగన్ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను గాలికొదిలేసిందని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆరోపించారు . విశాఖ స్టీల్ ప్లాంట్ పై కొందరు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అవసరాలకు మించి ఖర్చు చేసిందని చెప్పారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు స్టీల్ ప్లాంట్ ఇబ్బందుల్లో ఉందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేస్తామనేది అవాస్తవమని చెప్పారు. సెయిల్‌లో మెర్జ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.సెయిల్ లాభాల్లో ఉన్న కంపెనీ అని చెప్పారు. 2020 లో రాయబలేరీలో పెట్టుబడులు పెట్టారని... సెయిల్ వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాళ్లు ఏనాడూ అంగీకరించలేదని అన్నారు.
తాము విలీనం చేసుకోలేమని... ప్యాకెజీ ఇచ్చి మేనేజ్మెంట్ ఇమ్మని సెయిల్ వారి విన్నపమన్నారు. తీవ్ర ఆర్థిక పరమైన నష్టాలతో సతమవుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు ప్రకటించిందని అన్నారు. రూ.11, 440 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఇప్పటి వరకూ రూ.13090 కోట్లు ఎన్డీఏ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌కు ఇచ్చిందన్నారు.అనేక మంది ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్ అని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌ను ఎంతో సాయం చేస్తున్నారని అన్నారు. సిల్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉండాలని మోదీ భావిస్తున్నారని చెప్పారు. కేంద్రం సహాయం తర్వాత సమర్థవంతంగా విశాఖ స్టీల్ ప్లాంట్ నడపలేకపోతే అది మన వైఫల్యం చెందినట్లే అవుతుందన్నారు. కార్మికులకు సక్రమంగా జీతాలు అందించాలని ఆదేశించారు.
నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించి రూ.230 కోట్లు పెండింగ్‌లో జీతాలు ఉన్నాయని.. వాటిని కూడా త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వచ్చినప్పుడు ప్రధానమైన ఎజెండాగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పెట్టుకున్నారని చెప్పారు. చంద్రబాబు పట్టుదల వదలకుండా ప్రయత్నించడం వల్ల కేంద్రం నుంచి స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన సహాయం తీసుకువచ్చారని అన్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఏం మాట్లాడుతున్నారో అర్థంకాని పరిస్థితి ఉందని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు మైన్స్ లేకపోవడం వల్ల నష్టాలు వస్తున్నాయని అనడంలో వాస్తవం లేదన్నారు. గతంలో లాభాలు వచ్చినప్పుడూ మైన్స్ లేవు కదా అని ప్రశ్నించారు. దేశంలోని కొన్ని పరిశ్రమలకు మైన్స్ లేవు అని చెప్పారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. స్టీల్ ప్లాంట్‌లో మేనేజ్మెంట్ లోపాలు ఉన్నాయని... వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ విషయంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో కుమారస్వామి ఏపీకి వస్తారని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Nara Bhuvaneswari: అమరావతి ఇంటి స్థలాన్ని పరిశీలించిన నారా భువనేశ్వరి
Palla Srinivasa Rao: వారు నియమావళి దాటి మాట్లాడుతున్నారు... పల్లా శ్రీనివాస్‌రావు షాకింగ్ కామెంట్స్
GV Reddyః ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన నిర్ణయం
Read Latest AP News And Telugu News