Home » Vote
ఎన్నికల విధుల్లో ఉండగా ఆ అధికారి వ్యవహరించిన తీరు వివాదస్పదంగా మారింది. కీలక బాధ్యతల్లో ఉన్న పల్నాడు జిల్లా పంచాయతీ అధికారి విజయ భాస్కరెడ్డి పోలింగ్ రోజు ఉద్దేశపూర్వకంగానే కొన్ని గంటల పాటు కంట్రోల్ రూమ్‌ను వదిలేసి వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. తాను ఓటు వేసేందుకు వెళ్లినట్టు అయన చెబుతున్నారు.
ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. పలు చోట్ల వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. పోలింగ్ రోజున రాత్రి వరకు పోలింగ్ జరిగింది. దీంతోపాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా భారీగా పెరిగాయి.
మాచర్ల నియోజకవర్గంలో మార్పు మొదలైందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ప్రజల్లో వస్తోన్న మార్పును చూసి పోలింగ్ జరిగే రోజున ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎం పగులగొట్టారని ఆరోపించారు. పిన్నెల్లి అహంకారాన్ని మాచర్ల ప్రజలు నిశ్శబ్ద విప్లవంతో అణిచివేశారని వివరించారు. నియోజకవర్గంలో పిన్నెల్లిని ప్రజలు తిరస్కరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పోలింగ్ బూత్‌లోకి మొబైల్ తీసుకునేందుకు అనుమతి ఉండదు. గది బయట ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది తనిఖీ చేస్తుంటారు. అలాంటిది ఓ యువకుడు మొబైల్ తీసుకోవడమే కాదు ఏకంగా వీడియో కూడా తీశాడు. మాములుగా అయితే ఒకసారి ఓటు వేయాలి. అతను ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఎనిమిది సార్లు ఓటు వేశాడు.
ఇటీవల ముగిసిన పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకంటే పురుషులే ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం. అయినా మహిళా ఓటర్ల కన్నా పురుషులు అధికంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో పురుష ఓటర్లు 9,97,792 మంది ఉండగా, మహిళా ఓటర్లు 10,20,124మంది ఉన్నారు. ఇందులో పురుషుల ఓటర్లు 8,37,451మంది, మహిళా ఓటర్లు 8,18,996 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో రాయదుర్గం, ...
సార్వత్రిక ఎన్నికల్లో గెలుపోటములు నిర్ణయించేది మహిళా ఓటర్లేనని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత స్థానిక నాయకులతో పేర్కొన్నారు. ఆమె గురువారం నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కలిసి ఆయా మండలాల్లో జరిగిన ఓటింగ్ సరళిపై చర్చించారు.
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. సరికొత్త రికార్డు సృష్టించారు. దేశంలో ఇప్పటి వరకు జరిగిన నాలుగు దశల పోలింగ్ ప్రక్రియలో ఏపీ టాప్‌లో నిలిచింది. సోమవారం జరిగిన
ఈవీఎంలను భ ద్రపరిచిన సా్ట్రంగ్ రూమ్‌ల వద్ద భద్రత ఏ ర్పాట్లను ఎస్పీ మాధవ రెడ్డి పరిశీలించారు. ఆ యన బుధవారం నా యనపల్లి వద్ద ఉన్న బిట్ కళాశాలలోని స్ర్టాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఏ ర్పాట్లను పరిశీలించి, వారికి సూచనలు అందించారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్‌రూమ్‌ను తనిఖీ చేశారు. స్ర్టాంగ్ రూమ్ లవద్ద కేంద్ర సాయుధ బలగాలు ఆర్మీ రిజర్వ్డ్ బలగాలు, సివిల్ పోలీసు బలగాలు 24గంటలపాటు మోహరించి ఉంటాయన్నారు.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పక్రియ ముగిసింది. ఇక లెక్కింపు మాత్రమే మిగిలింది. ఫలితాలు తెలుసుకోవడానికి 20 రోజుల పాటు వేచి చూడాల్సి ఉంది. అయితే ఎన్నికల్లో పోటీచేసిన అభ్య ర్థులతో పాటు రాజకీయ నాయకులు, కార్య కర్తలు, ప్రజలు ఫలితాలపై అంచనాలు మొ దలు పెట్టారు. ఎక్కడ చూసినా, ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ జోరుగా సాగుతోంది. అన్ని పార్టీల అభ్యర్థుల భవిత్యం ఈవీఎం బాక్స్‌లలో నిక్షిప్తం అయింది. మొత్తంగా ప్రధాన పార్టీలైనే టీడీపీ, వైసీపీ మధ్యనే పోటీ నెలకొంది.
పెనుకొండ నియోజకవర్గంలో టీడీపీ కూటమి బంపర్ మె జార్టీతో విజయం సాధించబోతోందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత అన్నారు. గోరంట్లలోని పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో ఆమె బుధవారం సమావేశమయ్యారు. పోలింగ్ కేంద్రాల వారీగా పోలింగ్ సరళి, పోలైన ఓట్లు, అనుకూల, ప్రతికూల పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ... ప్రజలను పెద్దఎత్తున సమీకరించి పోలింగ్ కేంద్రా లకు వచ్చేలా చేసిన కూటమి నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.