Home » Weather
గత కొద్దిరోజుల నుంచి ఎండల తీవ్రత, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. అలాంటి వారికి వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వాతావరణం చల్లగా మారుతోందని.. వర్షం కురవనుందని వెల్లడించింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడనుందని పేర్కొంది.
బెంగళూరు నగరంలో వర్షాలు సాధారణమే. ఏడాదిలో ఏడెనిమిది నెలలపాటు ఇక్కడ వర్షం కురుస్తుంది. అయితే, జూన్ ఆరంభంలోనే ఆదివారం ఒకే రోజు ఏకంగా 110.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 133 ఏళ్ల నాటి రికార్డును బద్ధలు కొట్టింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల వాతావరణం, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు కారణమైన ఎల్ నినో బలహీనపడుతోందని, ఈ ఏడాది జూలై-సెప్టెంబరులో లా నినా ఏర్పడే అవకాశం 60 శాతం వరకు ఉందని ప్రపంచ వాతావరణ విభాగం(డబ్ల్యూఎంవో) తాజా బులెటిన్లో వెల్లడించింది.
Heavy Rain in Telangana: తెలంగాణ రాజధాని హైదరాబాద్లో(Telangana Capital Hyderabad) వాతావరణం(Weather) ఒక్కసారిగా మారింది. ఇప్పటి వరకు ఎండ దంచికొట్టగా.. ఇప్పుడు వాతావరణం చల్లబడింది. మేఘావృతమైన వర్ష సూచన(Rain Alert to Hyderabad) కనిపిస్తోంది. భాగ్యనగరాన్ని కారుమబ్బులు కమ్మేశాయి.
ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అనుకున్న సమయం కన్నా మూడు రోజులు ముందే రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి.
కేరళకు ఆనుకుని అరేబియా సముద్రంతో పాటు బంగాళాఖాతం, కోస్తాంధ్రల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. అలాగే అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో తేమ మేఘాలు ఆవరించడంతో రుతుపవనాలకు అనుకూలమైన వాతావరణం కొనసాగుతోంది.
ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ముంగేశ్పుర్లో అత్యధికంగా 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు చూపించింది. దీనిపై తాజాగా కేంద్రం స్పందించింది. ఉష్ణోగ్రతలు(Delhi Temperatures) చూపించే సెన్సార్ సరిగా పని చేయకపోవంతోనే అధిక టెంపరేచర్ చూపించడానికి కారణమని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగ భగలు కొనసాగుతోన్నాయి. మే నెల చివరి వారంలో కూడా ఎండలు విజృంభిస్తున్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోహిణి కార్తె సందర్భంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో వాతావరణ చల్లని కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో శనివారం (ఈ రోజు) నుంచి మూడు రోజులు వర్షాలు పడతాయని అధికారులు వివరించారు.
భానుడు వేడితో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో ప్రజలు రోడ్ల మీదకు రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎండతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
Monsoon Updates: రుతుపవనాలు(Monsoon) కాలానుగుణంగా ఏర్పడుతాయి. మన దేశంలో రెండు రకాల రుతుపవనాలు ఉన్నాయి. అవి మొదట ఏర్పడే నైరుతి రుతుపవనాలు. ఆ తరువాత ఈశాన్య రుతుపవనాలు. బలమైన గాలుల దిశలో కాలానుగుణంగా ఏర్పడే మార్పే రుతుపవనాలు.