Home » Weather
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల ఆంధ్రప్రదేశ్లో బుధవారం నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని చోట్ల వాతావరణం చల్లగా మారింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు వర్షం ఉంటుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం అమెరికా-వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో టీమిండియా వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతోంది. సూపర్-8 మ్యాచ్లో టీమిండియా ఇప్పటికే ఓ విజయం సాధించింది. ఈ రోజు (శనివారం) మరో కీలక మ్యాచ్కు సిద్ధమవుతోంది. అంటిగ్వాలో బంగ్లాదేశ్తో తలపడబోతోంది.
నైరుతి రుతుపవనాలు కొంచెం ముందుగానే వచ్చినా ఆశించిన మేరకు వర్షపాతం మాత్రం నమోదు కాలేదు.
నైరుతి రుతుపవనాలు ఉత్తరాంధ్రలో రెండు జిల్లాలు తప్ప దక్షిణ భారతం మొత్తం విస్తరించాయి. అయినప్పటికీ ముసురు వాతావరణం కనిపించడం లేదు. పైగా వేసవి మాదిరిగా ఎండలు, వడగాడ్పులు కొనసాగుతున్నాయి.
దేశ రాజధాని న్యూఢిల్లీతోపాటు సరిహద్దు రాష్ట్రాలు హర్యానా, ఉత్తరప్రదేశ్లో వడగాల్పలు బలంగా వీస్తున్నాయి. వీటి తీవ్రత మరింత పెరిగి అవకాశముంది. ఈ నేపథ్యంలో సోమవారం జారీ చేసిన రెడ్ అలర్ట్ను బుధవారం వరకు పొడిగిస్తున్నట్లు భారత వాతావరణం విభాగం మంగళవారం వెల్లడించింది.
హైదరాబాద్లో భారీ వర్షం (Heavy Rain) పడుతోంది. ఈరోజు(సోమవారం) మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృత్తమే భారీ వాన కురుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు.
Weather Upates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో(Andhra Pradesh) భారీగా వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. ఇప్పటికే పలు చోట్ల వర్షాలు కురుస్తుండగా.. మరో మూడు రోజుల పాటు ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు.
విశాఖపట్నంలో శనివారం సాయంత్రం సుమారు గంటపాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గంటకు 55 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల ధాటికి పలుచోట్ల చెట్లు, హోర్డింగ్లు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో హీట్ వేవ్(heat wave) అలాగే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షం కురిసే అవకాశం ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో హీట్ వేవ్ అలాగే కొనసాగుతుందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
భాగ్యనగరంలో ఒక్కసారిగా భారీ వర్షం (Heavy Rain) పడుతోంది. ఈరోజు( గురువారం) మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృత్తమే భారీ వాన పడుతోంది. మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. వర్షం పడుతుండటంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.